Ayyappanum Koshiyum: హిందీ రీమేక్ కూడా ఫిక్స్.. హీరోలు వీళ్ళే!

మలయాళం సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. ఇప్పటికే పలు రీమేక్ కథలు నార్త్ నుండి సౌత్ లో మిగతా బాషలలో ఇప్పుడు మరికొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి.

Ayyappanum Koshiyum: హిందీ రీమేక్ కూడా ఫిక్స్.. హీరోలు వీళ్ళే!

Ayyappanum Koshiyum

Updated On : August 31, 2021 / 10:23 AM IST

Ayyappanum Koshiyum: మలయాళం సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. ఇప్పటికే పలు రీమేక్ కథలు నార్త్ నుండి సౌత్ లో మిగతా బాషలలో ఇప్పుడు మరికొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి అయ్యప్పనుం కోషియం. పృథ్వీ రాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పుడు అన్ని బాషల దర్శక, నిర్మాతల కన్ను పడింది. ఇప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మధ్యనే విడుదలైన పవన్ పరిచయ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

కాగా, ఈ సినిమా హిందీ రీమేక్ సినిమాకు కూడా హీరోలు ఫిక్స్ అయ్యారట. అయ్యప్పనుమ్ కథ నచ్చడంతో జాన్‌ అబ్రహం చాలా రోజుల క్రిందటే హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. రీమేక్ ప్రయత్నాలు కూడా కొద్దిరోజుల క్రిందంటే మొదలు పెట్టగా హిందీ సినిమాలో జాన్‌ అబ్రహం-అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు మొదట వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ నుంచి అభిషేక్‌ బచ్చన్ తప్పుకున్నట్టు తెలుస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఆ స్థానంలో మరో యంగ్ హీరో పేరు వినిపిస్తుంది.

నిన్నటి వరకు అభిషేక్ బచ్చన్ నటించనున్నాడని అనుకున్న స్థానంలో అర్జున్ కపూర్ రానున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రీమేక్ లో బిజూ మేనన్‌ పాత్రలో జాన్‌ అబ్రహం నటిస్తుండగా, పృథ్వీ రాజ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌ కనిపించనున్నారు. జగన్‌శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో మొదలు కానున్నట్లు తెలుస్తుంది.