లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ లపై అన్‌స్టాపబుల్‌లో బాలయ్య, చంద్రబాబు చర్చ?
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కాబోతుంది.

Babu spoke openly with Balayya about Lokeshs future
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఆదివారం పూర్తైంది. మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు.
విజయసాధనలో పడ్డ ఇబ్బందులు, జనసేనానితో తనుకున్న అప్యాయతలు ఇలా ఎన్నో విషయాలను చంద్రబాబు బాలకృష్ణతో పంచుకున్నారట. ఇక బాలయ్య కూడా జనాలు అనుకుంటున్న పలు ప్రశ్నలను బాబు ముందు ఉంచారట. ఇందుకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Unstoppable with NBK: ధోనీ, కోహ్లీలలో సీఎం చంద్రబాబుకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్‌లకు సంబంధించిన ప్రశ్నలను అడిగినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఎవరి కోసమో చూస్తూ కూర్చోదని, అలాగే వారసత్వం అనేది ఉందని, కార్యకర్తగా మొదలై, నాయకుడిగా ఎదిగి తనను తాను ప్రూవ్ చేసుకున్న వారికే పగ్గాలు అందుతాయని ఓ సందర్భంలో బాబు అన్నారట.
అలా తనను తాను లోకేష్ ప్రూవ్ చేసుకున్నారనే అభిప్రాయం ఇటు బాలయ్చ, అటు చంద్రబాబు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ కోసం నందమూరి ఆడపడుచులు పడిన కష్టాలను సైతం చంద్రబాబు వివరించారట. ఇలా ఎన్నెన్నో ఆసక్తికర అంశాలను చంద్రబాబు చెప్పారట.