Sai Rajesh : ప్రేక్ష‌కులకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బేబీ ద‌ర్శ‌కుడు.. ఆ ఒక్క డైలాగ్ మాత్ర‌మే..!

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం బేబీ. సినిమాలోని కొన్ని డైలాగ్స్ ప‌ట్ల విమ‌ర్శ‌లు రావ‌డం పై చిత్ర ద‌ర్శ‌కుడు సాయి రాజేశ్ స్పందించాడు.

Sai Rajesh : ప్రేక్ష‌కులకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బేబీ ద‌ర్శ‌కుడు.. ఆ ఒక్క డైలాగ్ మాత్ర‌మే..!

Baby Movie Director Sai Rajesh

Sai Rajesh sorry to Audience : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా జూలై 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యూత్‌పుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆరు రోజుల్లోనే రూ.43.8 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించి విజ‌య‌వంతంగా దూసుకుపోతుంది. అయితే.. ఈ సినిమాలో ఉప‌యోగించిన కొన్ని ప‌దాల‌పై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.

BRO vs LGM : బాక్సాఫీస్ వ‌ద్ద ధోని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మ‌ధ్య ఫైట్‌..!

సినిమాలోని కొన్ని డైలాగ్స్ ప‌ట్ల విమ‌ర్శ‌లు రావ‌డం పై చిత్ర ద‌ర్శ‌కుడు సాయి రాజేశ్ స్పందించాడు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆ ప‌దాల‌ను వాడిన‌ట్లు చెప్పుకొచ్చాడు. సినిమా ఆరంభంలో హీరోహీరోయిన్ల మ‌ధ్య స్ట్రాంగ్ ల‌వ్‌స్టోరీ ఉన్న‌ట్లు చూపించాము. కాబట్టి హీరో ప‌దునైన మాట‌ల‌తో హీరోయిన్ మ‌న‌స్సును నొప్పిస్తే గానీ ఆమె మ‌న‌స్సు మ‌రో వైపుకు వెళ్ల‌దు. అందుక‌నే ఆ స‌న్నివేశానికి త‌గిన‌ట్లు ఇంట‌ర్వెల్‌లో కొన్ని అభ్యంత‌ర ప‌దాలు వాడిన‌ట్లు రాజేశ్ చెప్పాడు.

Mahesh Babu : గుంటూరు కారం కోసం మ‌హేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్ రెమ్యున‌రేష‌న్..?

అయితే.. ‘తెరవాల్సింది కళ్లు కాదు..’ అనే విష‌యంలో మాత్రం ప్రేక్ష‌కుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ డైలాగ్‌ను పెట్టి ఉండాల్సింది కాదన్నారు. అయితే.. మిగ‌తా డైలాగ్స్ అన్ని సినిమాకు ఖ‌చ్చితంగా అవ‌స‌రం అని అభిప్రాయ‌ప‌డ్డారు. మొద‌ట్లో సినిమా నిడివి గురించి విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని, అయితే.. ఇప్పుడు నిడివి ప‌ట్టించుకోకుండా ప్ర‌తి ఒక్క‌రు చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

Eesha Rebba : అభిమానుల‌కు షాక్ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు.. తండ్రి ఎక్క‌డంటే..?

ఇక క్లైమాక్స్ విష‌యానికి వ‌స్తే మొద‌ట 16 నిమిషాల‌తో కూడిన సీన్ పెట్టాము. అయితే.. ఎంతో క‌ష్ట‌ప‌డి దాన్ని ఏడు నిమిషాల‌కు తీసుకువ‌చ్చిన‌ట్లు సాయి రాజేశ్ తెలిపారు.