Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో బ్యాచిలర్ భామ.. ఫస్ట్ అప్డేటే అదుర్స్ అంటున్న ఆడియన్స్!

సుడిగాలి సుధీర్ తన 4వ సినిమాని ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బ్యాచిలర్ భామ..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో బ్యాచిలర్ భామ.. ఫస్ట్ అప్డేటే అదుర్స్ అంటున్న ఆడియన్స్!

Bachelor fame Divya Bharathi as heroine in Sudigali Sudheer movie

Updated On : May 11, 2023 / 2:23 PM IST

Sudigali Sudheer : ప్రముఖ టీవీ షోతో కమెడియన్ గా తెలుగు వారి అందరికి పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. అడపాదడపా పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చిన సుధీర్.. సాఫ్ట్‌వెర్ సుధీర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వాంటెడ్‌ పండుగాడు వంటి సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. కానీ ఈ సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే గత ఏడాది రిలీజ్ అయిన ‘గాలోడు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన హిట్టుతో సుధీర్ హీరో కెరీర్ ముందుకు కదిలింది.

Naga Chaitanya – Samantha : ఆ సిరీస్‌తోనే విడిపోయారు అంటూ రూమర్స్.. కానీ అదే ఇష్టమంటున్న నాగచైతన్య!

తాజాగా సుధీర్ తన 4వ సినిమాని ప్రకటించాడు. కొత్త దర్శకుడు నరేష్ లీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ భామ దివ్య భారతి (Divya Bharathi) నటిస్తుంది. మొదటి సినిమా బ్యాచిలర్ తోనే యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. రెండో చిత్రంగా ‘మధిల్ మెల్ కాదల్’ అనే తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు మూడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక దివ్య భారతి హీరోయిన్ గా ప్రకటించడంతో.. ఆడియన్స్ ఫస్ట్ అప్డేటే అదుర్స్ అంటున్నారు.

Rashmika Mandanna : మరో కాంట్రవర్సీలో చిక్కుకున్న రష్మిక.. చికెన్ తెచ్చిన సమస్య ఏంటో తెలుసా?

మహాతేజా క్రియేషన్స్ అండ్ లక్కీ మీడియా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామంటూ ప్రకటించారు. కాగా సుధీర్ మరో సినిమాకి సంబంధించిన ఒక వార్త కూడా ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్, సంతోషం వంటి సినిమాలను తెరకెక్కించిన దశరథ్‌తో సుధీర్‌ ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ మూవీ పై కూడా అధికారిక ప్రకటన రానుంది.