Venu Yeldandi : తండ్రైన బలగం వేణు.. పాప పుట్టిందంటూ ఫొటో షేర్ చేసి..

ఓ పక్క జబర్దస్త్, పలు టీవీ షోలు, సినిమాలతో మంచి పేరు తెచ్చుకొని బిజీగా ఉన్న వేణు ఇటీవల బలగం అనే సినిమాతో దర్శకుడిగా మరి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Venu Yeldandi : తండ్రైన బలగం వేణు.. పాప పుట్టిందంటూ ఫొటో షేర్ చేసి..

Balagam Venu shared a photo saying that he became a father and a baby Girl was born

Updated On : October 20, 2023 / 6:17 PM IST

Venu Yeldandi : కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన వేణు జబర్దస్త్ తో మరింత పాపులర్ అయ్యాడు. ఓ పక్క జబర్దస్త్, పలు టీవీ షోలు, సినిమాలతో మంచి పేరు తెచ్చుకొని బిజీగా ఉన్న వేణు ఇటీవల బలగం అనే సినిమాతో దర్శకుడిగా మరి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా బలగం సినిమా పెద్ద హిట్ అవ్వడంతో అందరూ వేణుని అభినందించారు.

Also Read : Roshan Kanakala : బన్నీతో యాంకర్ సుమ కొడుకు.. పుష్ప 2 షూట్‌లో..

బలగం సినిమాతో మరింత పేరు ప్రఖ్యాతలు, అవార్డులు అందుకున్నాడు వేణు. త్వరలోనే రెండో సినిమా కూడా దర్శకుడిగా మొదలుపెట్టనున్నాడు. తాజాగా తాను తండ్రి అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తనకు పాప పుట్టింది అని తెలుపుతూ పాపని ఎత్తుకొని దిగిన ఫోటోని షేర్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు వేణుకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక వేణుకి ఇప్పటికే ఒక బాబు ఉండగా ఇప్పుడు పాప పుట్టింది.

View this post on Instagram

A post shared by Venu Yeldandi (@venuyeldandi9)