మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్‌లో బాలయ్య..
మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్‌లో నటసింహ నందమూరి బాలకృష్ణ..

మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్‌లో నటసింహ నందమూరి బాలకృష్ణ..
నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఒక్కసారి కథ నచ్చి ఒకే చెప్పాక దర్శకుడిపై నమ్మకంతో ముందుకెళ్లిపోతారాయన. బాలయ్య ప్రస్తుతం తన 106వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది.
తర్వాతి సినిమా సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఓ మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ బాలయ్యతో చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తుంది. ఈ మధ్య మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ హక్కులను ఈ సంస్థ తీసుకుంది.
రిటైర్డ్ హవల్దార్, ఓ పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే ఈగో వార్‌కి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. బిజు మీనన్ పోలీస్ అధికారిగా, పృథ్వీరాజ్ హవల్దార్‌గా నటించి మెప్పించారు. ఇందులో పాత్రలను యువ హీరోలు చేయలేరు కాబట్టి. ఇందులో ఓ పాత్రలో బాలకృష్ణ నటింప చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. త్వరలో బాలయ్యకు సినిమా చూపించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ మలయాళ రీమేక్‌లో నటించడానికి బాలయ్య బాబు ఒప్పుకుంటారో లేదో చూడాలి.