Bhagavanth Kesari OTT : భగవంత్ కేసరి ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌.

Bhagavanth Kesari OTT : భగవంత్ కేసరి ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Bhagavanth Kesari movie OTT partner

Updated On : October 19, 2023 / 7:38 PM IST

Bhagavanth Kesari : న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌. శ్రీలీల కీల‌క పాత్ర‌ను పోషించింది. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా న‌టించ‌గా తమన్ సంగీతాన్ని అందించారు. అనిల్ రావిపూడి, బాల‌కృష్ణ కాంబినేష‌న్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రంపై ఎంతో క్యూరియాసిటీ ఏర్ప‌డింది.

ద‌స‌రా కానుక‌గా నేడు (అక్టోబ‌ర్ 19న‌) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. థియేట‌ర్ల వ‌ద్ద బాల‌య్య అభిమానుల సంద‌డి మామాలుగా లేదు. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది. ఓటీటీ భాగ‌స్వామికి సంబంధించిన వివ‌రాల‌ను సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే చిత్ర‌బృందం తెలియ‌జేసింది.

Rathika Rose : భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్ భామ.. ఎవరు? ఏ పాత్రలో?

ఇక ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంద‌నే వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ భారీ ధ‌ర‌కు ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుద‌లైన యాభై రోజుల త‌రువాత‌నే స్ట్రీమింగ్‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని టాక్‌. అంటే ఈ లెక్క‌న డిసెంబ‌ర్ రెండు లేదంటే మూడో వారంలో ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంద‌ట‌. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.