Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్‌కి గ్రాండ్‌ ప్లాన్.. అక్కడ అప్పుడు రిలీజ్ చేస్తారట..

భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్‌కి గ్రాండ్‌ ప్లాన్.. అక్కడ అప్పుడు రిలీజ్ చేస్తారట..

Balakrishna Bhagavanth Kesari trailer launch event update

Updated On : October 2, 2023 / 9:42 PM IST

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna), కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal), శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ఇక ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఇప్పటికే ఒక సాంగ్ ని, టీజర్ ని రిలీజ్ చేసింది. రెండో సాంగ్ రిలీజ్ కి కూడా డేట్ ఫిక్స్ చేసింది. తాజాగా ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారట. బాలయ్య గత రెండు సినిమాలు మాదిరిగానే ఈ మూవీ ట్రైలర్ ని కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ఈ నెల 8న వరంగల్ లో భారీగా ఫంక్షన్ ఏర్పాటు చేసి ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారట. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని సమాచారం.

Also Read : Ileana D’Cruz : తన బిడ్డతో ఉన్న ఫోటోని షేర్ చేసిన ఇలియానా.. అప్పుడే రెండు నెలలు..

కాగా ఇటీవల ‘భగవంత్ కేసరి జర్నీ’ అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో బాలయ్య ‘గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే’ అంటూ చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది. దీంతో ట్రైలర్ లో ఎటువంటి డైలాగ్స్ ఉండబోతున్నాయో అని ఆసక్తి నెలకుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. జైలర్ అండ్ విక్రమ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య తన కూతురు కోసం చేసే యుద్ధమే ఈ మూవీ స్టోరీ అని సమాచారం. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.