బాలయ్య నట విశ్వరూపం

సినిమాలో ఎక్కడా బాలయ్య కనిపించలేదు, అన్నగారే కనిపించారు అని అంటున్నారంటే, బాలయ్య తన తండ్రి పాత్రలోకి ఎంతలా పరకాయ ప్రవేశం చేసాడో అర్థం చేసుకోవచ్చు.

  • Published By: sekhar ,Published On : January 9, 2019 / 11:05 AM IST
బాలయ్య నట విశ్వరూపం

సినిమాలో ఎక్కడా బాలయ్య కనిపించలేదు, అన్నగారే కనిపించారు అని అంటున్నారంటే, బాలయ్య తన తండ్రి పాత్రలోకి ఎంతలా పరకాయ ప్రవేశం చేసాడో అర్థం చేసుకోవచ్చు.

నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తుండగా, క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్, ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి అన్ని చోట్ల నుండి మంచి టాక్ వస్తుంది. తారకరాముని జీవితాన్ని తెరపై చూడడానికి, తండ్రిపాత్రలో తనయుడి నట విశ్వరూపాన్ని చూడడానికి అభిమానులు, జనాలు థియేటర్ల బాట పట్టారు. సినిమా చూసిన వాళ్ళంతా, సినిమాలో ఎక్కడా బాలయ్య కనిపించలేదు, అన్నగారే కనిపించారు అని అంటున్నారంటే, బాలయ్య తన తండ్రి పాత్రలోకి ఎంతలా పరకాయ ప్రవేశం చేసాడో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ చేసిన పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు మరెవరూ చెయ్యలేదు. కథానాయకుడులో బాలయ్య, తన తండ్రి పోషించి మెప్పించిన కృష్ణుడు, ధుర్యోధనుడు, అర్జునుడు వంటి పలు పాత్రల్లో కనివిందు చేసాడు.

ఇన్నాళ్ళూ ఆయన చేసిన సినిమాల్లో నటన ఒక ఎత్తయితే, ఈ కథానాయకుడులో చేసిందొకటే ఒకెత్తు. రావణుడు క్యారెక్టర్ కోసం అప్పట్లో ఎన్టీఆర్ ఎంత కష్ట పడ్డారో, ఆ కష్టాన్ని బాలయ్య తెరపై చూపించిన తీరుకి హ్యాట్సాఫ్ అనాల్సిందే. తండ్రిలోని మంచితనాన్నీ, ఆవేశాన్నీ, అణుకువనీ, కృషి, పట్టుదల, సంకల్ప బలం వంటివన్నీ బాలయ్య చూపించిన తీరుకి అందరూ ముగ్ధులవుతూ, బాలయ్య తన తండ్రి రుణం తీర్చుకున్నాడు, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా, బాలయ్య ఎన్టీఆర్‌కిచ్చే నిజమైన ఘన నివాళి అని పొగుడుతున్నారు. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

వాచ్ ట్రైలర్…