Bhagavanth Kesari : బాలయ్య అభిమానుల రచ్చ.. కటౌట్‌కి అభిషేకం పాలతో కాదు.. ఆల్కహాల్‌తో.. అది కూడా ఏ బ్రాండ్ తెలుసా?

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజయినప్పుడు కటౌట్స్ కి, బ్యానర్స్ కి అభిమానులు పాలాభిషేకాలు చేస్తారని తెలిసిందే. అయితే నేడు బాలయ్య అభిమానులు బాలకృష్ణ బ్యానర్స్ కి పాలతో కాకుండా ఆల్కహాల్ తో అభిషేకం చేయడం వైరల్ గా మారింది.

Bhagavanth Kesari : బాలయ్య అభిమానుల రచ్చ.. కటౌట్‌కి అభిషేకం పాలతో కాదు.. ఆల్కహాల్‌తో.. అది కూడా ఏ బ్రాండ్ తెలుసా?

Balakrishna Fans anointing Balayya Banners with Alcohol on Bhagavanth Kesari Release

Updated On : October 19, 2023 / 8:08 PM IST

Bhagavanth Kesari : వరుస హిట్స్ తో బాలకృష్ణ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నేడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా రిలీజయింది. ఇక బాలయ్య సినిమా అంటే అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందేగా.

నేడు భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కావడంతో థియేటర్స్ వద్ద బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు సందడి చేశారు. బాలయ్య కటౌట్స్, బ్యానర్స్ పెట్టి పూల దండలు వేసి, డప్పులతో, క్రాకర్స్ పేలుస్తూ థియేటర్స్ ముందు హడావిడి చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజయినప్పుడు కటౌట్స్ కి, బ్యానర్స్ కి అభిమానులు పాలాభిషేకాలు చేస్తారని తెలిసిందే.

Also Read : Bhagavanth Kesari OTT : భగవంత్ కేసరి ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

అయితే నేడు బాలయ్య అభిమానులు బాలకృష్ణ బ్యానర్స్ కి పాలతో కాకుండా ఆల్కహాల్ తో అభిషేకం చేయడం వైరల్ గా మారింది. అది కూడా బాలయ్య బాబుకి ఇష్టమైన మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ తో అభిషేకం చేయడంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. బాలకృష్ణ పలుమార్లు మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ గురించి ప్రస్తావించారు. బాలయ్య చేసే అన్‌స్టాపబుల్ షోకి కూడా మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. మ్యాన్షన్ హౌస్ అంటే బాలయ్య అనేలా వైరల్ చేశారు. దీంతో అభిమానులు ఇలా పలు చోట్ల ఆ బ్రాండ్ ఆల్కహాల్ తో బాలయ్య బ్యానర్స్ కి అభిషేకం చేయడంతో వైరల్ అవ్వడమే కాక చర్చగా మారింది.