Balakrishna : బాలకృష్ణ NBK109 టైటిల్, టీజర్ వచ్చేసాయి.. బాలయ్యకు ఎలివేషన్ అదిరిందిగా..

తాజాగా నేడు బాలకృష్ణ NBK 109 సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేసారు.

Balakrishna : బాలకృష్ణ NBK109 టైటిల్, టీజర్ వచ్చేసాయి.. బాలయ్యకు ఎలివేషన్ అదిరిందిగా..

Balakrishna NBK 109 Movie Title Announced and Teaser Released

Updated On : November 15, 2024 / 10:31 AM IST

Balakrishna NBK 109 : వరుసగా మూడు 100 కోట్ల కలెక్షన్స్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు.

గతంలో ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. అయితే ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఈ సినిమా టైటిల్ చెప్పమని అడుగుతున్నారు. తాజాగా నేడు బాలకృష్ణ NBK 109 సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే పేరు పెట్టారు. మీరు కూడా టీజర్ చూసేయండి..

 

ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులని ఆడించే ఆ రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది అని అదిరిపోయే ఎలివేషన్స్ తో బాలయ్యకు ఇంట్రో ఇచ్చారు టీజర్లో. డాకు మహారాజ్ అంటూ పవర్ ఫుల్ గా బాలయ్య చెప్పి అదరగొట్టారు. ఇక ఈ సినిమాను 2025 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.