Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’

నందమూరి బాలకృష్ణ, తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం చేస్తున్న టాక్ షో కు ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే పేరు ఫిక్స్ చేశారు..

Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’

Unstoppable With Nbk

Updated On : October 10, 2021 / 10:58 AM IST

Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ, తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం ఓ టాక్ షో చెయ్యబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్యతో ఫొటోషూట్ కూడా చేశారు. షూట్ టైంలో ఆయన కాలికి గాయమైనా ఆపకుండా ఫొటోషూట్ కంటిన్యూ చేశారు.

Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

ఇప్పుడు బాలకృష్ణ టాక్ షో కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. బాలయ్య సరికొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అంటూ ఈ షో పేరు రివీల్ చేశారు. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే సాలిడ్ పేరు ఫిక్స్ చేశారు.

Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!

ఇప్పటివరకు చూసిన సెలబ్రిటీ టాక్ షోలకు భిన్నంగా బాలయ్య షో ఉండబోతుంది. ‘పైసా వసూల్’ ప్రమోషన్స్‌లో భాగంగా పూరితో కలిసి రానా ‘నెం.1యారి’ షోలో బాలయ్య ఎంతలా సందడి చేశారో తెలిసిందే. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగు ఓటీటీ ‘ఆహా’ టాక్ షో తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రెమ్యునరేషన్ తీసుకోకుండా ఓ ఛారిటీ కోసం బాలయ్య ఈ షో హోస్ట్ చేస్తున్నారు.