Balakrishna: ఏదైనా తను దిగనంతవరకే అంటున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ న్యూ ప్రోమో సాంగ్!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వెండితెరపై నటనతోనే కాదు, బుల్లితెరపై యాంకర్ గాను భళా అనిపిస్తునాడు. గత ఏడాది నవంబర్ లో మొదలైన "అన్‌స్టాపబుల్" టాక్ షో, ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అయిన 'ఆహా'లో ప్రసారమవుతూ మంచి ప్రేక్షాధారణ పొందడమే కాకుండా "బాప్ అఫ్ అల్ టాక్ షోస్" అనిపించుకుంది.

Balakrishna Unstoppable Season 2 Update
Balakrishna: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వెండితెరపై నటనతోనే కాదు, బుల్లితెరపై యాంకర్ గాను భళా అనిపిస్తునాడు. గత ఏడాది నవంబర్ లో మొదలైన “అన్‌స్టాపబుల్” టాక్ షో, ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అయిన ‘ఆహా’లో ప్రసారమవుతూ మంచి ప్రేక్షాధారణ పొందడమే కాకుండా “బాప్ అఫ్ అల్ టాక్ షోస్” అనిపించుకుంది.
Balakrishna: బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ రీరిలీజ్ రెవెన్యూలో 75 శాతం బసవతారకం ట్రస్ట్ కి ఇస్తాం
ఇక ఈ ఏడాది మొదటిలో మహేష్ బాబు గెస్ట్ గా ఈ షో సీజన్-1 పూర్తి కాగా, ఇప్పుడు సెకండ్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బాలకృష్ణ. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అన్‌స్టాపబుల్ షో నిర్వాహకులు ఒక ప్రమోషనల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఈ షోకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ని త్వరలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
“ఏదైనా ఈ సాంగ్ రిలీజ్ అయ్యేవరకే… ఒన్స్ బాలయ్య స్టెప్స్-ఇన్ హిస్టరీ రిపీట్స్. ఇక్కడ ప్లే చేస్తే రీసౌండ్ ఎక్కడో వస్తది.. గారంటీ” అంటూ ట్వీట్ చేస్తూ అంచనాలను పెంచేశారు షో నిర్వాహకులు. కాగా ఈ సీజన్ ఫస్ట్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారా? అనే చర్చ గట్టిగా నడుస్తుంది.