Balakrishna Vs Nagarjuna : బాలకృష్ణ వర్సెస్ నాగార్జున రీ రిలీజ్‌లో కూడా పోటీ.. మన్మధుడు వర్సెస్ భైరవద్వీపం

ఇప్పుడు బాలయ్య - నాగార్జున బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీ పడబోతున్నారు. అయితే ఈ సారి రీ రిలీజ్ సినిమాలతో పోటీ పడుతున్నారు.

Balakrishna Vs Nagarjuna : బాలకృష్ణ వర్సెస్ నాగార్జున రీ రిలీజ్‌లో కూడా పోటీ.. మన్మధుడు వర్సెస్ భైరవద్వీపం

Balakrishna Vs Nagarjuna at Boxoffice with Manmadhudu and Bhairava Dweepam Re Releases

Updated On : August 29, 2023 / 7:19 AM IST

Balakrishna Vs Nagarjuna : మన హీరోలు తమ సినిమాలతో ఏదో ఒక సమయంలో ఒకేసారి రిలీజ్ చేసి పోటీ పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి,. ఇక సీనియర్ హీరోలు అయితే గతంలో పండగలకు ఒకేసారి తమ సినిమాలని రిలీజ్ చేసేవారు. సీనియర్ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున గతంలో కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇక నాగార్జున ఘోస్ట్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఇంకా ఏ సినిమా ఓకే చేయలేదు.

ఇప్పుడు బాలయ్య – నాగార్జున బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీ పడబోతున్నారు. అయితే ఈ సారి రీ రిలీజ్ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇటీవల కాలంలో మన హీరోల పాత సినిమాలని అభిమానుల కోసం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న నాగార్జున సూపర్ హిట్ సినిమా మన్మధుడు(Manmadhudu) ని గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నారు. మన్మధుడు రీ రిలీజ్ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) చేయడం విశేషం. ఈ రీ రిలీజ్ కి ప్రమోషన్స్ కూడా చేశారు.

Thani Oruvan 2 : ధృవ సీక్వెల్ అనౌన్స్‌మెంట్.. ప్రోమో అదిరిపోయింది.. ఈసారి విలన్..

ఇక బాలయ్య బాబు రేపు ఆగస్టు 30న తన సూపర్ హిట్ సినిమా భైరవద్వీపంతో(Bhairava Dweepam) రాబోతున్నారు. అభిమానుల కోసం ఈ సినిమాని రేపు రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఓ పక్క నాగ్ అభిమానులతో పాటు మరో పక్క బాలయ్య అభిమానులు కూడా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు రీ రిలీజ్ కలెక్షన్స్ కూడా అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. మరి బాలయ్య – నాగ్ రీ రిలీజ్ లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.