Akhanda 2: బాలకృష్ణ ఫ్యాన్స్ కు మరో బిగ్ షాక్..! అఖండ-2 సినిమా విడుదల వాయిదా..

దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటన చేసింది.

Akhanda 2: బాలకృష్ణ ఫ్యాన్స్ కు మరో బిగ్ షాక్..! అఖండ-2 సినిమా విడుదల వాయిదా..

Updated On : December 5, 2025 / 12:41 AM IST

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ-2 సినిమా విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం (డిసెంబర్ 5) విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేశారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటన చేసింది. అనివార్య కారణాలతో మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామంది. కాగా, ఈ సినిమా ప్రీమియర్స్ ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేయగా.. తాజాగా రిలీజ్ ను కూడా వాయిదా వేశారు. ఈ నిర్ణయం బాలయ్య ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది.

సినిమా విడుదల వాయిదాపై చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ ఎక్స్‌ లో పోస్ట్ పెట్టింది. ‘‘అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్‌ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైంది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకుంటాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం’’ అని నిర్మాణ సంస్థ తెలిపింది.

కాగా, అంతకుముందు ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రీమియర్ షోల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్.. వాటిని రద్దు చేయడంతో కొంత నిరాశకు గురయ్యారు. ఈ షాక్ నుంచి ఫ్యాన్స్ బయటపడేలోపే.. ఏకంగా సినిమా విడుదలే వాయిదా పడటం మరింత నిరుత్సాహానికి గురి చేసింది. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కించారు. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రీమియర్ షోలు రద్దు కావడంతో బాలయ్య అభిమానులకు 14 రీల్స్ ప్లస్ క్షమాపణలు చెప్పింది. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని ఎమోషనల్ అయ్యింది. తమ వంతు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయిందని మేకర్స్ విచారం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం నిజంగా దురదృష్టకరం అన్నారు. ప్రీమియర్స్ ద్వారా భారీ ఓపెనింగ్స్, పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని టీమ్ భావించింది. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేకంగా టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతులు ఇచ్చాయి. కానీ టెక్నికల్ సమస్యల వల్ల ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినట్లు మేకర్ చెప్పారు.

Also Read: ఫిబ్రవరిలోనే పెళ్లి.. స్పందించిన రష్మిక.. నేను ఆ మాటలను తప్పు పట్టను..