Rashmika Mandanna: ఫిబ్రవరిలోనే పెళ్లి.. స్పందించిన రష్మిక.. నేను ఆ మాటలను తప్పు పట్టను..

టాలీవుడ్ లో మరోసారి స్టార్ లవ్ బర్డ్ జంట ఒకటి కానున్నారు. ఆ జంట మరెవరో కాదు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా(Rashmika Mandanna). చాలా కాలంగా ఈ ఇద్దరు స్టార్స్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Rashmika Mandanna: ఫిబ్రవరిలోనే పెళ్లి.. స్పందించిన రష్మిక.. నేను ఆ మాటలను తప్పు పట్టను..

Rashmika Mandanna makes interesting comments on her marriage to Vijay Deverakonda

Updated On : December 4, 2025 / 5:01 PM IST

Rashmika Mandanna; టాలీవుడ్ లో మరోసారి స్టార్ లవ్ బర్డ్ జంట ఒకటి కానున్నారు. ఆ జంట మరెవరో కాదు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా(Rashmika Mandanna). చాలా కాలంగా ఈ ఇద్దరు స్టార్స్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని షాకిచ్చారు. ఈ ఎంగేజ్మెంట్ తంతు కూడా చాలా గోప్యాంగా జరిగింది. ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య చాలా సీక్రెట్ గా జరిగింది. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుందో అంటూ ఇద్దరి స్టార్స్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు 2026 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లితో ఒకటికానున్నారు అంటూ తెలుస్తోంది.

Bunny Vasu: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. ఇంకా కోలుకోని శ్రీతేజ్.. బన్నీ వాస్ ఏమన్నారంటే..

తాజాగా ఇదే విషయంపై స్పందించింది రష్మిక మందన్నా. రీసెంట్ గా ఈ బ్యూటీ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఫిబ్రవరిలో మీ పెళ్లి అనే టాపిక్ ని ప్రస్తావించింది. దానికి సమాధానంగా రష్మిక మాట్లాడుతూ..’నేను ఈ న్యూస్ పై ఇప్పుడు స్పందించలేను. అలాగని ఖండించను. పెళ్లి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాము. నాకు పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని కలపడం ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లో సినిమాల గురించి కూడా మాట్లాడను. ప్రతీ దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను. దాని ప్రకారమే ముందుకు వెళ్తాను. అలాగే పెళ్లి విషయంలో కూడా” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

దీంతో రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రష్మిక మైసా అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన రౌడీ జనార్ధన సినిమా చేస్తున్నాడు. ఈమధ్యే మొదలైన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.