Bunny Vasu: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. స్పందించిన బన్నీ వాసు.. ఆ ఫ్యామిలీ బాధ్యత మాది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 విడుదలై నేటికీ ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా(Bunny Vasu) ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Bunny Vasu: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. స్పందించిన బన్నీ వాసు.. ఆ ఫ్యామిలీ బాధ్యత మాది..

One year since Pushpa 2 accident: Bunny Vasu's comments go viral

Updated On : December 4, 2025 / 5:44 PM IST

Bunny Vasu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 విడుదలై నేటికీ ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళాడు. అల్లు అర్జున్ జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే, అప్పటినుంచి చిన్నారి శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఆ పిల్లాడి ఆరోగ్యం ఇంకా సెట్ అవలేదు.

Balakrishna: స్కోప్ లేదని ఫోటోకి దండ వేసాం.. పాపం ప్రగ్యా.. బాలకృష్ణ అలా అనేశాడేంటి..?

తాజాగా ఈ ఘటన జరిగి ఏడాది కావస్తున్న వేళ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) ఈ విషయంపై స్పందించాడు. తాజాగా ఆయన ఈషా మూవీ టీజర్ ఈవెంట్ లో పాల్గొన్నాను. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ “నిర్మాత దిల్‌రాజు, ఇతర పెద్దలు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇరు వైపుల నుంచి ఎలాంటి సమస్య వచ్చినా మాట్లాడుకుని ముందుకు వెళ్తున్నాం. బాధిత కుటుంబం దానిపట్ల సంతృప్తిగా ఉన్నారా.. లేదా అనేదానికి కొన్ని మార్గదర్శకాలను ఫాలో అవుతున్నాము. ఆస్పత్రి ఖర్చులకు ఎంత ఇవ్వాలి? నెలవారీ ఖర్చులకు ఎంత ఇవ్వాలని అనేది డిస్కషన్ జరుగుతోంది. అది సరిపోకపోతే పెద్ద మనుషులతో వచ్చి మాట్లాడొచ్చు. ఏవైనా సరిచేసుకోవాలంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఈ విషయం గురించి ఇక్కడ మాట్లాడటం సరికాదు” అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాస్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.