Balakrishna: స్కోప్ లేదని ఫోటోకి దండ వేసాం.. పాపం ప్రగ్యా.. బాలకృష్ణ అలా అనేశాడేంటి..?
నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. లేటెస్ట్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు.
Balakrishna makes funny comments on Pragya Jaiswal character in Akhanda 2
Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. లేటెస్ట్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గని లెవల్లో అఖండ 2 టీజర్, ట్రైలర్ ఉంటడంతో రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా డిసెంబర్ 5,న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ కనిపించింది. కానీ, అఖండ సినిమాలో బాలకృష్ణ భార్యగా ప్రగ్యా కనిపించింది. అసలు ఈ సినిమాలో ఆమె పాత్ర ఉంటుందా. టీజర్, ట్రైలర్ లో ఎక్కడా కనిపించలేదు అని చాలా మంది అనుకున్నారు. కానీ, తాజాగా ఈ పాత్ర గురించి నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న బాలయ్య(Balakrishna)ను యాంకర్ ఆడుగుతూ.. అఖండలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ చేసింది. కానీ ఈ సినిమాలో ఆమె కనిపించడం లేదు. అసలు ప్రగ్యా ఈ సినిమాలో ఉన్నారా లేరా అని అడిగారు. దానికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ 2లో ప్రగ్యా పాత్రలో పెద్దగా స్కోప్ లేదు. ఒక వేళ పెడదాం అనుకున్నా కథకు అడ్డం పడుతోంది ఆ పాత్ర. అందుకే ఆమె ఫోటోకి దండ వేషము అంటూ”చెప్పుకొచ్చాడు. దీంతో బాలకృష్ణ చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
