Chinmayi Sripada: ముందే తెలిస్తే ఆ పాట పాడేదాన్ని కాదు.. “ద్రౌపది 2” పాటపై చిన్మయి కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన దర్శకుడు
ద్రౌపది 2లో 'ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) పాడింది. అయితే, ఈ పాట పాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది చిన్మయి.
Director Mohan g makes shocking comments on singer Chinmayi Sripada
Chinmayi Sripada; రిచర్డ్ రిషి హీరోగా దర్శకుడు మోహన్. జి తెరకెక్కిస్తున్న భారీ సినిమా ద్రౌపది 2. నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) పాడింది. అయితే, ఈ పాటను పాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది చిన్మయి. ఈ పాట గురించి ముందే తెలిస్తే అసలు పాడేదాన్ని కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో దర్శకుడు ఆమెకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఎం కోనె..(నెలరాజె..) అనే పాట సినిమాలో ఎలాంటి సందర్భంలో వస్తుంది అంటే.. కాంచీపురం సంస్థానానికి చెందిన రాణి ద్రౌపది దేవి. ఆమె వివాహం కడవరాయ సంస్థానానికి చెందిన వీరసింహ కడవరాయన్‌తో జరుగుతుంది. అలాగే, హోయసాల రాజ్యానికి చెందిన మహారాజు వీర వల్లాల 3 కడవరాయన్‌కు పట్టాభిషేకం చేసి పెళ్లి కూడా జరిపిస్తారు. ద్రౌపది సీమంతం సమయంలో కడవరాయన్‌కు ఒక బహుమతి ఇస్తాడు వీర వల్లాల మహారాజు. ఆ సందర్భాల్లో ఈ పాట వస్తుంది.
దీంతో, పాట విడుదలైన కొద్దీ సేపటికే సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది చిన్మయి. పాట రికార్డింగ్ సమయంలో సినిమా గురించి నాకు చెప్పలేదు. సినిమా భావజాలం తెలిస్తే అసలు పడేదాన్నే కాదు అంటూ రాసుకొచ్చింది. దీంతో, చిన్మయి చేసిన కామెంట్స్ పై దర్శకుడు మోహన్. జి స్పందించాడు. నేను ముందు నుంచి ఈ పాటను చిన్మయి పాడితెనె బాగుటుంది అని అనుకున్నాను. అందుకే ఆమెతోనే పాడించాను. కానీ, రికార్డింగ్ సమయంలో సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేరు. అందుకే కేవలం పాటను పడించడం జరిగింది. కాబట్టి, ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి” అంటూ కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు. దీంతో ఈ ఇద్దరూ చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
