Sathish Javvaji: చిన్న సినిమా డైరెక్టర్ కి పెద్ద ఆఫర్.. ఏకంగా నానితో మూవీ
నేచురల్ స్టార్ నానితో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న బ్యాండ్ మేళం మూవీ డైరెక్టర్ సతీష్ జవ్వాజి(Sathish Javvaji).
band melam movie director sathish javvaji doing his next movie with nani
-
సతీష్ జవ్వాజికి నాని బంపర్ ఆఫర్.
-
వాల్ పోస్టర్ బ్యానర్లో కొత్త సినిమా.
-
యూత్‌ఫుల్ రొమాంటిక్ సోషల్ మెసేజ్ స్టోరీ.
Sathish Javvaji: ఇటీవలే ‘బ్యాండ్ మేళం’ చిత్రంతో టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సతీష్ జవ్వాజి(Sathish Javvaji). ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మాణంలో, యువ నటీనటులు రోషన్, శ్రీదేవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ వైవిధ్యభరితమైన సక్సెస్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సతీష్ జవ్వాజి, విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుని టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Rowdy Janardhana: రాజశేఖర్ కోసం విజయ్ సేతుపతిని తీసేశారా.. ‘రౌడీ జనార్ధన’ టీం షాకింగ్ డెసిషన్
ఈ విజయంతో సతీష్ జవ్వాజికి టాలీవుడ్లో ఒక బంపర్ ఆఫర్ లభించింది. నేచురల్ స్టార్ నాని నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్లో ఆయన తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. ఇటీవల దర్శకుడు సతీష్ చెప్పిన ఒక వైవిధ్యమైన లైన్‌కు నాని పూర్తిగా ఇంప్రెస్ అయ్యారని, కథ కూడా ఫైనల్‌గా లాక్ అయిందని సమాచారం. ఓపక్క హీరోగా వరుస విజయాలు అందుకుంటూనే, మరోపక్క నిర్మాతగా క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తూ నాని సక్సెస్ పీక్స్‌లో ఉన్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ ఖరారు కావడం విశేషం.
ఈ సరికొత్త చిత్రం పక్కా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా సాగుతూనే, సమాజానికి అవసరమైన ఒక మంచి సోషల్ మెసేజ్‌తో కూడి ఉంటుందని తెలుస్తోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ వాల్యూకు తగ్గట్టుగా వైవిధ్యమైన కథాంశంతో ఈ స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ చిత్రంలో నటించబోయే హీరోహీరోయిన్లు, సాంకేతిక నిపుణుల (కాస్ట్ అండ్ క్రూ) వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
