Bro Movie : పవన్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బండ్ల గణేష్ వస్తున్నాడు..

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది. నేడు జరగబోయే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బండ్ల గణేష్ వస్తున్నాడు.

Bandla Ganesh is comming for Pawan Kalyan Bro Movie

Bro Movie : సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన సినిమా ‘బ్రో’. సోషియో ఫాంటసీ నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రంలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో ‘గోపాల గోపాల’ మూవీలో హాఫ్ టైం పవన్ మోడరన్ దేవుడిగా కనిపించి అలరించాడు. ఇప్పుడు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించి ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో మరింత అంచనాలు పెంచేసింది.

Mahesh Babu – Balakrishna : రీ రిలీజ్‌కి సిద్దమవుతున్న మహేష్, బాలయ్య సూపర్ హిట్ సినిమాలు..

ట్రైలర్ లోని పవన్ కళ్యాణ్ చూసిన అభిమానులకు వింటేజ్ స్వాగ్ కనిపించింది. దీంతో ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని థియేటర్స్ లో ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జులై 25న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగబోతుంది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నాడు. అయితే పవన్ అభిమానులు ఇంకొకరి రాక కోసం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అది ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. అతనే పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా చెప్పుకొనే బండ్ల గణేష్ (Bandla Ganesh).

Harish Kalyan : టాలీవుడ్ హీరోలు చేసే ఆ పని ప్రతిఒక్కరికి ఆదర్శం.. ఇటీవల అల్లు అర్జున్ గారు..

పవన్ మూవీ ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ స్పీచ్ కి అభిమానుల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ ఇచ్చే ఎలివేషన్స్ మరే స్టార్ డైరెక్టర్, రైటర్ వల్ల కాదంటారు ఫ్యాన్స్. అయితే గత కొంత కాలంగా పవన్ మూవీ ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ స్పీచ్ మిస్ అవుతుంది. దీంతో అభిమానులంతా నిరాశ చెందుతున్నారు. ఆ స్పీచ్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ కూడా రాబోతున్నాడట. ఇక ఈ రోజు స్పీచ్ అదిరిపోతోంది గెట్ రెడీ పవర్ స్టార్ ఫ్యాన్స్.