Harish Kalyan : టాలీవుడ్ హీరోలు చేసే ఆ పని ప్రతిఒక్కరికి ఆదర్శం.. ఇటీవల అల్లు అర్జున్ గారు..

చిన్న హీరోలు మరియు సినిమాల విషయంలో టాలీవుడ్ బడా హీరోలు చేసే పని అందరికి ఆదర్శం అంటున్నాడు తమిళ్ హీరో హరీష్ కళ్యాణ్.

Harish Kalyan : టాలీవుడ్ హీరోలు చేసే ఆ పని ప్రతిఒక్కరికి ఆదర్శం.. ఇటీవల అల్లు అర్జున్ గారు..

Harish Kalyan comments on tollywood heroes and Allu Arjun

Harish Kalyan : తమిళ యువ హీరో హరీష్ కళ్యాణ్.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో కోలీవుడ్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇక టాలీవుడ్ ఆడియన్స్ కి నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ మూవీలో నాని కొడుకుగా కాసేపు కనిపించాడు. ఇప్పుడు ఫుల్ క్యారెక్టర్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించబోతున్నాడు. ఇండియన్ కూల్ కెప్టెన్ ధోని (MS Dhoni) నిర్మాణంలో తెరకెక్కుతున్న మొదటి ప్రాజెక్ట్ LGM (లెట్స్ గెట్ మ్యారీడ్). తమిళ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.

Sakshi Dhoni : పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ గారికి ఇచ్చేంత మనీ నా దగ్గర లేదు.. ధోని భార్య సాక్షి!

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధోని సతీమణి సాక్షి, చిత్ర నటీనటులు పాల్గొన్నారు. ఇక ఈ ఇంటరాక్షన్ లో హీరో హరీష్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు, తెలుగు ఆడియన్స్ కి నేను పెద్ద ఫ్యాన్. ఇక్కడ ప్రేక్షకులు ఒక సినిమాని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఎంతగానో ఆదరిస్తారు. అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు ఇతర టాలీవుడ్ బిగ్ స్టార్స్ అంటే చాలా ఇష్టం మరియు ఎంతో గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద స్టార్స్.. ఒక చిన్న సినిమాని, ఒక చిన్న హీరోని ప్రోత్సహిస్తూ ఉంటారు. వారి సినిమాలు గురించి పోస్టులు వేస్తుంటారు. వారి ఫంక్షన్స్ కి వస్తుంటారు. వాళ్ళ మూవీ సక్సెస్ అయ్యితే పెద్ద స్టార్స్ సెలబ్రేట్ చేస్తుంటారు. ఇటీవల అల్లు అర్జున్ గారు బేబీ మూవీ విషయంలో చేసిన పని కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శం” అంటూ వ్యాఖ్యానించాడు.

Sakshi Dhoni : అల్లు అర్జున్‌కి నేను పెద్ద ఫ్యాన్.. తన సినిమాలు చూస్తూనే పెరిగాను.. ధోని భార్య సాక్షి!

ఈ స్పీచ్ మొత్తం తెలుగులో మాట్లాడడమే కాకుండా మహేష్ బాబు పోకిరి డైలాగ్ కూడా చెప్పి అదరగొట్టాడు. కాగా LGM మూవీ ఆగష్టు 4న రిలీజ్ కాబోతుంది. లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా (Ivana) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంటే నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రమేష్ తమిళమణి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.