FNCC Elections : ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో బండ్ల గణేష్ ఓటమి.. అధ్యక్షుడిగా కృష్ణ సోదరుడు..
ఇటీవల జరిగిన తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ ఎన్నికలు బాగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్లబ్ లో మొత్తం 4 వేల 600మంది సభ్యులు ఉండగా 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో..............

Bandla Ganesh lost in Film Nagar Cultural Center elections
FNCC Elections : ఇటీవల జరిగిన తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ ఎన్నికలు బాగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్లబ్ లో మొత్తం 4 వేల 600మంది సభ్యులు ఉండగా 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఈ ఓటు హక్కుని ఎన్నికల్లో వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలపై బండ్ల గణేష్ చేసిన ట్వీట్ తో ఇవి వైరల్ గా మారాయి.
తాజాగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మరోసారి కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఓటమి చెందారు. బండ్లగణేష్ పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా ఈ సారి అల్లుఅరవింద్, సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్‌లోని సభ్యులు గెలుపొంది కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.