Bandla Ganesh : సినీ పెద్దలకు కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేశ్.. సీఎం రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ..
నటుడిగా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేశ్.

Bandla Ganesh tweet on celebrities who did not wish CM Revanth reddy
Bandla Ganesh : నటుడిగా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేశ్. ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్టులు, ట్వీట్లకు యమా క్రేజ్ ఉంటుంది. ఒక్కొసారి ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ కాంగ్రెస్ లీడర్ చేసిన పోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
నిన్న (నవంబర్ 8) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా బర్త్‌డే విషెస్ చెప్పారు. ఇక సినీ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అయితే.. కొద్ది మంది సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపకపోవడంతో బండ్ల గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
“గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను.” అని ట్విట్టర్‌లో బండ్ల గణేశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Pushpa 2 : శ్రీలీలతో ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్.. ఫోటో లీక్..
గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO
— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024