Priyanka Chopra : ‘వారణాసి’ కంటే ముందు యాక్షన్ తో వచ్చిన ప్రియాంక చోప్రా.. ఈ ట్రైలర్ చూసారా?
మరోసారి ప్రియాంక చోప్రా యాక్షన్ తో అదరగొట్టనుంది. (Priyanka Chopra)
Priyanka Chopra
Priyanka Chopra : ఆల్రెడీ హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేసిహ్ బాబు సరసన వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది ప్రియాంక. అయితే ఈ సినిమా 2027 లో రానుండగా దానికంటే ముందే మరో హాలీవుడ్ యాక్షన్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రియాంక చోప్రా.
రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక చోప్రా జంటగా గత సంవత్సరం ‘సిటడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 2 రాబోతుంది, యాక్షన్ అభిమానులు, ప్రియాంక అభిమానులు సిటాడెల్ సిరీస్ సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Nagababu : రీ ఎంట్రీతోనే సంచలన కామెంట్స్.. ఒక్కోసారి వీళ్ళని కొట్టాలనిపించేది.. జబర్దస్త్లో నాగబాబు..
తాజాగా సిటాడెల్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ కి మించి యాక్షన్, ఛేజింగ్ సీక్వెన్స్ లు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా సిటాడెల్ సీజన్ 2 ట్రైలర్ ని విడుదల చేసారు. మే 6 నుంచి సిటాడెల్ సిరీస్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈసారి ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కాబోతుంది. మరోసారి ప్రియాంక చోప్రా యాక్షన్ తో అదరగొట్టనుంది.
మీరు కూడా ప్రియాంకచోప్రా సిటాడెల్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ఇక్కడ చూసేయండి..
Also Read : Alia Bhatt : ఇందుకు కాదు పాకిస్థాన్ వాళ్ళని తిట్టేది.. AI ని వాడి మన హీరోయిన్ ని.. తిట్టినా సమర్ధించుకుంటూ..
