Bellamkonda Suresh : ఆది రీరిలీజ్ చేస్తా.. చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ కి వచ్చిన డబ్బులన్నీ బసవతారకం ట్రస్ట్‌కి ఇస్తాం..
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. 'ఇటీవల బాలకృష్ణ గారి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఆ డబ్బు మొత్తాన్ని బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నాం. త్వరలో ఎన్టీఆర్............

Bellamkonda Suresh says about re releasing if NTR Aadi Movie
Bellamkonda Suresh : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. దసరా పండగకి చిరంజీవి, నాగార్జున సినిమాలు ఉన్నా ధైర్యంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫుల్ కామెడీతో ప్రేక్షకులందర్నీ నవ్విస్తూ మంచి విజయం సాధించింది.
తాజాగా సోమవారం సాయంత్రం స్వాతిముత్యం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘‘స్వాతిముత్యం రిలీజైన మొదటి రెండు రోజులు కలెక్షన్స్ చూసి భయపడ్డాం. కానీ సినిమా బాగుండటంతో మౌత్ టాక్ తోనే జనాలు వస్తున్నారు. మూడో రోజు నుంచి కలెక్షన్స్ పెరిగాయి. చిరంజీవి సినిమా ఉన్నా స్వాతిముత్యం నిలబడింది. గణేష్‌ను హీరోగా లాంచ్ చేసిన నాగవంశీ, చినబాబులకు రుణపడి ఉంటాను. ఓ నిర్మాతగా నేను కూడా గణేష్‌కు ఇంత మంచి లాంచింగ్ ఇవ్వనేమో.”
Nuvve Nuvve 20 Years Celebrations : నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్ళ సెలబ్రేషన్స్
”ఇటీవల బాలకృష్ణ గారి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఆ డబ్బు మొత్తాన్ని బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నాం. త్వరలో ఎన్టీఆర్ గారి ‘ఆది’ సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాము” అని తెలిపారు. ఇటీవల స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆది రిలీజ్ చేస్తామనడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.