Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అడిషన్.. ఎగ్జైట్మెంట్‌లో ఫ్యాన్స్!

ఒకపక్క భీమ్లానాయక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరో పక్క హరిహర వీరమల్లు షూటింగ్ కోసం ఏర్పాట్లు. ఇంతలో పవన్ కళ్యాణ్ అభిమానులకు, క్రేజీ అడిషన్ తో బంపర్ బోనాంజ ప్రకటించింది.

Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అడిషన్.. ఎగ్జైట్మెంట్‌లో ఫ్యాన్స్!

Bheemla Nayak

Updated On : February 15, 2022 / 3:15 PM IST

Bheemla Nayak: ఒకపక్క భీమ్లానాయక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరో పక్క హరిహర వీరమల్లు షూటింగ్ కోసం ఏర్పాట్లు. ఇంతలో పవన్ కళ్యాణ్ అభిమానులకు, క్రేజీ అడిషన్ తో బంపర్ బోనాంజ ప్రకటించింది భీమ్లానాయక్ టీమ్. పవర్ స్టార్ భీమ్లానాయక్ పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా చాలా పెద్ద పండుగ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. అలాంటిది సెన్సేషనల్ భీమ్లానాయక్ నుంచి మరో క్రేజీ అడిషన్ రానుందనే బిగ్ న్యూస్ అందించాడు తమన్.

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

అది కూడా సింగర్ కైలాష్ ఖేర్, లిరికిస్ట్ రామ జోగయ్య శాస్త్రి కాంబినేషన్ లో రానుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ అనౌన్స్ మెంట్ తో ఫాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కు మరింత బూస్టప్ ఇచ్చాడు తమన్. కైలాష్ ఖేర్, రామజోగయ్య శాస్త్రి కాంబినేషన్ లో గతంలో సూపర్ డూపర్ హీరో ఎంట్రీ సాంగ్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు కూడా అలాంటి క్రేజీ సాంగే ఇవ్వబోతున్నారని ఎగ్జైట్ అవుతున్నారు పవన్ ఫాన్స్. ఒకపక్క సినిమాలతోనూ, మరో పక్కన పాలిటిక్స్ తోనూ బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఈ సాంగ్ అదనపు వర్కే షెడ్యూల్ క్రియేట్ చేసింది.

Manchu Vishnu: విజయవాడకు మంచు విష్ణు.. కాసేపట్లో సీఎం జగన్‌తో భేటీ..!

కానీ.. ఇప్పటికే భీమ్లానాయక్ నుంచి ఏ సాంగ్ వచ్చినా ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. అలాంటిది కైలాష్ ఖేర్, రామ్ జో కాంబోలో వచ్చే సాంగ్ కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను, భీమ్లానాయక్ స్ట్రెంత్ ను పెంచే సాంగ్ అవుతుందని సంబరపడి పోతున్నారు ఫాన్స్. ఒకపక్క భీమ్లానాయక్ ఫైనల్ వర్క్స్ లో పాల్గొంటూ రిలీజ్ కు రెడీ చేస్తూనే, మరో పక్క హరి హర వీరమల్లు షూటింగ్ కు డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘భీమ్లా నాయక్’ వాయిదా పడినట్టే..

మార్చి 18 నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ రీస్టార్ట్ కానుంది. ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ ఫినిష్ చేసుకున్న హరిహర వీరమల్లు షూటింగ్, బీహార్ యాక్షన్ సీక్వెన్స్ తో షురూ కానున్నట్టు సమాచారం. సో పవన్ కళ్యాణ్ కమిట్ అయిన వరుస సినిమాల కోసం బిజీ షెడ్యూల్ తో ఉండబోతున్నాడని, కరోనా కారణంగా కొంత గ్యాప్ ఒచ్చినా ఇక ముందు పవర్ స్టార్ సినిమాలు స్పీడ్ అందుకోబోతున్నాయని ఎగ్జైట్ అవుతున్నారు ఫాన్స్.