Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ కోసం రెండు రిలీజ్ డేట్స్..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ రీమేక్ ‘భీమ్లా నాయక్’ కోసం రెండు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేశారు మేకర్స్..

Bheemla Nayak
Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని.. ‘భీమ్లా నాయక్’ పేరుతో.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Thaman : పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం ‘భీమ్లా నాయక్’.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్..
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర డైరెక్టర్ చేస్తున్నారు. పవన్ పక్కన నిత్య మీనన్, రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీకి డైలాగ్స్, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఉండగా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పాన్ ఇండియా మూవీస్ కారణంగా ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు.
RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
కొద్ది రోజులుగా ఆ డేట్ కూడా డౌటే అని వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన కొద్దిసేపటికే ‘భీమ్లా నాయక్’ అప్‌డేట్ ఇచ్చారు టీం. ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్‌లానే రెండు డేట్స్ అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందుగా అనుకున్న ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ‘భీమ్లా నాయక్’ మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.
Acharya: ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లో హీట్ పెంచనున్న పెద్ద సినిమాలు