సోషల్ మీడియాలో కామెంట్లపై బిగ్ బాస్ కౌశల్ కంప్లయింట్
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-2 విజేత కౌశల్ గురువారం (మార్చి 8, 2019) సైబర్ క్రైం స్టేషన్ లో ఆన్ లైన్ హర్రాస్ మెంట్ కంప్లయిట్ చేశాడు.

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-2 విజేత కౌశల్ గురువారం (మార్చి 8, 2019) సైబర్ క్రైం స్టేషన్ లో ఆన్ లైన్ హర్రాస్ మెంట్ కంప్లయిట్ చేశాడు.
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-2 విజేత కౌశల్ గురువారం (మార్చి 8, 2019) సైబర్ క్రైం స్టేషన్ లో ఆన్ లైన్ హరాస్ మెంట్ కంప్లయిట్ చేశాడు. కౌశల్ ఆర్మీ అభిమానులు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తనపై తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నట్టు ఫిర్యాదులో తెలిపాడు.
కౌశల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసుకున్నారు. తనపై ఆన్ లైన్ లో అనుచిత వ్యాఖ్యలు చేసినవారి ఐపీ అడ్రస్ వివరాలు కోరుతూ గూగుల్ కు కౌశల్ లేఖ రాశాడు. కౌశల్ ఆర్మీని స్థాపించిన అనంతరం జరిగిన పరిణామాలతో కౌశల్ వ్యవహారశైలిని తప్పుబడుతూ ఆయన అభిమానులంతా ఆరోపణలు చేస్తున్నారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2
ఇటీవలే తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా కౌశల్ క్లారిటీ ఇచ్చుకున్నారు కూడా. అయినప్పటికీ తనను, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు యూట్యూబ్, వాట్సాప్ ప్లాట్ ఫాంల్లో అసభ్యకరమైన రీతిలో కామెంట్లు పెడుతున్నారని కౌశల్ ప్రధాన ఆరోపణ. తన భార్య నీలిమపై యూట్యూబ్, వాట్సాప్ ల్లో అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారని ఆరోపించాడు.
కౌషల్ ఆర్మీ ఫౌండేషన్ తరపున వచ్చిన ఫండ్స్ ను కౌషల్ దుర్వినియోగం చేస్తున్నారని కొన్నిరోజులుగా కౌషల్ ఆర్మీ అభిమానులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేన్సర్ పేషెంట్ల ట్రీట్ మెంట్ కోసం ఫౌండేషన్ ఫండ్స్ వినియోగిస్తానని నమ్మించి తమను మోసం చేశాడని ఫ్యాన్స్ ఆరోపించారు. కౌశల్ ఆర్మీ ఆరోపణలపై స్పందించిన కౌశల్ ధీటుగా బదులిచ్చాడు. బిగ్ బాస్ 2 షో విజేతగా నిలిచిన అనంతరం కౌశల్ ఆర్మీ ఫాండేషన్ ప్రారంభించినట్టు తెలిపాడు.
Also Read : ఆన్ లైన్‌లో ప్రపోజ్ చేస్తే చంపేస్తా : హీరోయిన్ సోనాక్షి సిన్హా
అయితే తన అభిమానులుగా చెప్పుకుంటూ కొంతమంది తన పేరుతో ఫండ్స్ సేకరిస్తున్నారని కౌశల్ ఆరోపించాడు. దీనికి సంబంధించి జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలను తాను అపాయింట్ చేసినట్టు చెప్పాడు. ఇందులో కొందరి వ్యవహారశైలి కారణంగా వారిని తొలగించినట్టు కౌశల్ చెప్పాడు. తనతో సినిమా చేస్తానని చెప్పిన ఒక ఫైనాన్సియర్ కూడా వీరితో చేతులు కలిపి తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు కౌశల్ ఆరోపించాడు.
Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుక పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు