బిగ్ బాస్ 3: వరుణ్ ఎమోషనల్ జర్నీ

బిగ్‌బాస్ సీజన్ 3 ఇప్పటి వరకు ఎన్నో గొడవలు, ప్రేమలు, బంధాలు, అలకలతో సాగింది. అప్పుడే గొడవపడతారు.. అప్పుడే కలిసిపోతారు. ఎవరిని ఏ రీజన్ తో నామినేట్ చేయాలా అని ఆలోచించేది వాళ్లే.. వారు ఎలిమినేట్ అయి వెళ్లిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే.
ఇలా అన్ని ఎమోషన్స్ తో వంద రోజులు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ 3. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఓ సూపర్ డూపర్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. అదేంటంటే.. ఇప్పటివరకు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లలో వాడిన వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా మార్చి ఒక్కొక్కరిని అందులోకి పిలిచి బిగ్‌బాస్ ఇంట్లో వారి వందరోజుల జర్నీని చూపించనున్నారు.
ఈ రోజు ఎపిసోడ్ లో వరుణ్ తన జర్నీని చూస్తూ ఏడుస్తున్నట్లు చూపించారు. ఇంటిసభ్యులకు ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఎన్నో ఎమోషన్స్, ఎన్నో జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. మరి వారి జర్నీలు ఎలా ఉన్నాయో మనం కూడా చూసేద్దాం.