Bigg Boss 5 : అవన్నీ రూమర్స్.. వచ్చేస్తున్నాడు ‘బిగ్ బాస్’..

షో స్టార్ట్ కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండగా కొత్త పోస్టర్ వదిలి రూమర్స్‌కి బ్రేక్ వేశాడు బిగ్ బాస్..

Bigg Boss 5 : అవన్నీ రూమర్స్.. వచ్చేస్తున్నాడు ‘బిగ్ బాస్’..

Bigg Boss 5

Updated On : September 1, 2021 / 4:10 PM IST

Bigg Boss 5: గతకొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియా ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒకటే న్యూస్.. అదే ‘బిగ్ బాస్’.. ఇప్పటికి నాలుగు సీజన్లుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అతి త్వరలో ప్రారంభం కాబోతోంది.

Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..

ఈ షో కి సంబంధించి కంటెస్టెంట్ల గురించి వారి పారితోషికాల గురించి పలు వార్తలు వస్తున్నాయి కానీ.. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎలాంటి క్లూస్, న్యూస్ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Aata Sandeep : ‘బిగ్ బాస్-5’ లో డ్యాన్సింగ్ కపుల్..

అయితే క్వారంటైన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ముగ్గురుకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, దీంతో ‘బిగ్ బాస్ 5’ ఆలస్యమయ్యే అవకాశముందని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే అవన్నీ పుకార్లేనంటూ ఒకే ఒక్క పోస్టర్‌తో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేసింది బిగ్ బాస్ టీం.

Navya Swamy : బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ అదే..

షో స్టార్ట్ కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండగా కొత్త పోస్టర్ వదిలి రూమర్స్‌కి బ్రేక్ వేశాడు బిగ్ బాస్.. సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటలకు ‘బిగ్ బాస్ సీజన్ 5’ గ్రాండ్‌గా స్టార్ట్ కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు.. శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు బిగ్ బాస్ యాజమాన్యం.