Bigg Boss 7 Day 55 : వీకెండ్ ఎపిసోడ్‌లో కొంతమందిపైనే ఫైర్ అయిన నాగార్జున.. నాగ్ కూడా ఒక గ్రూప్‌కి సపోర్ట్ చేస్తున్నారా?

శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ అందరి తప్పులని ఎత్తి చూపాడు.

Bigg Boss 7 Day 55 : వీకెండ్ ఎపిసోడ్‌లో కొంతమందిపైనే ఫైర్ అయిన నాగార్జున.. నాగ్ కూడా ఒక గ్రూప్‌కి సపోర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 7 Day 55 Highlights Nagarjuna fires on Contestants

Updated On : October 29, 2023 / 6:49 AM IST

Bigg Boss 7 Day 55 : బిగ్‌బాస్ శుక్రవారం ఎపిసోడ్ గౌతమ్ కెప్టెన్ అవ్వడంతో ముగిసింది. ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి కంటెస్టెంట్స్ అందరి తప్పులని ఒక్కొక్కరిగా ఎత్తి చూపాడు. ఈ క్రమంలోనే మొదట శోభాశెట్టి – యావర్ పిచ్చోడు గొడవ గురించి మాట్లాడి శోభాని నువ్వు వేరే వాళ్ళను అనొచ్చు కానీ నిన్ను ఎవ్వరు అనకూడదా అని పాత సంఘటనలు గుర్తు చేసి చివాట్లు పెట్టాడు. ఇక యావర్ కి కూడా అరుస్తూ బిగ్‌బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు తిట్లు పడ్డాయి. ఈ గొడవలో ఇద్దరిది తప్పు ఉందని ఇద్దరిపై ఫైర్ అయ్యాడు.

ఇక అమర్ దీప్ ప్రశాంత్ గొడవలో మాత్రం అమర్ దీప్ ని టార్గెట్ చేసి మాట్లాడి ప్రశాంత్ తో మాత్రం ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు ఉంటున్నావు అని కూల్ గా మాట్లాడాడు నాగ్.ఆ తర్వాత రతికని హౌస్ లోకి ఎందుకెళ్ళావు? గేమ్ ఆడట్లేదు ఎందుకు అని తిట్టి ఇప్పట్నుంచైనా వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ వాడుకొమ్మని చెప్పాడు. ఇక శివాజీ రోజు రోజుకి వెళ్ళిపోతాను అంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో కూడా శివాజీ.. ఇక్కడ చాలామంది ప్రవర్తన ఇబ్బందిగా ఉంటుంది. నేను వెళ్ళిపోతాను అంటూ రాగం అందుకున్నాడు. దీంతో నాగ్ నీకేమనిపిస్తే అది చెప్పు, పర్లేదు, సేఫ్ గేమ్ ఆడొద్దు, ఇదే చివరి అవకాశం అంటూ ఓదార్చినట్టు చెప్పాడు.

Also Read : Chiyaan 62 : చియాన్ విక్ర‌మ్ 62 అనౌన్స్‌మెంట్.. వీడియో అదిరిపోయింది

దీంతో నాగార్జున కూడా ఒక గ్రూప్ కి కొమ్ము కాస్తున్నారని నిన్నటి ఎపిసోడ్ చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. హౌస్ లో ముఖ్యంగా రెండు బ్యాచ్ లు ఉన్నాయి. శివాజీ, ప్రశాంత్, యావర్ .. ఇలా శివాజీ బ్యాచ్ ఒకటి ఉండగా.. అమర్ దీప్ తో సీరియల్ బ్యాచ్ ఉంది. ప్రశాంత్ స్వయంగా వాళ్లంతా ఒక గ్రూప్ అని గతంలో ఒప్పుకున్నాడు. నాగ్ నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్ తో ఉన్న వాళ్లందరిమీద ఫైర్ అయి శివాజీ గ్రూప్ వాళ్ళని మాత్రం కూల్ గా చెప్పడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంటెస్టెంట్స్ అభిమానులు నాగార్జున పై ఫైర్ అవుతున్నారు.