Bigg Boss 7 Day 6 : ఆడియన్స్ ఎవరికి ఎన్ని మార్కులు ఇచ్చారు? 5 వారాలు హౌస్‌లో ప్లేస్ కంఫర్మ్ చేసుకున్న కంటెస్టెంట్?

కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ పల్స్ మార్కులు చెప్పేముందు ఈ వారం రోజులకి మీకు మీరు ఎంత మార్కులు వేసుకుంటారో చెప్పమన్నాడు. ఒక్కొక్కరు వాళ్లకు వాళ్ళు వేసుకున్న మార్కులు చెప్పగా నాగార్జున ఆడియన్స్ ఇచ్చిన మార్కులు చెప్పాడు..

Bigg Boss 7 Day 6 : ఆడియన్స్ ఎవరికి ఎన్ని మార్కులు ఇచ్చారు? 5 వారాలు హౌస్‌లో ప్లేస్ కంఫర్మ్ చేసుకున్న కంటెస్టెంట్?

Bigg Boss 7 Day 6 Highlights Audience Marks to Contestants Nagarjuna gives tasks to Contestants

Bigg Boss 7 Day 6 Highlights : బిగ్‌బాస్ మొదటివారం పూర్తి కావొచ్చింది. వారం అంతా కొట్టుకున్నా, ఏడ్చినా వీకెండ్ రెండు రోజులు మాత్రం నాగార్జున(Nagarjuna) వచ్చి హంగామా చేస్తారు. ఇక నిన్న శనివారం ఎపిసోడ్లో నాగార్జున వచ్చి వారమంతా కంటెస్టెంట్స్ చేసిన హడావిడి గురించి మాట్లాడతారు.

ఇక రోజురోజుకి కూడా ప్రశాంత్ – రతిక ప్రేమ వ్యవహారం ముదిరిపోయింది. ఈసారి ఏకంగా మోకాలిపై కూర్చొని రతిక కు ప్రపోజ్ చేసాడు ప్రశాంత్. ఇక రతిక తింటుంటే ఆమె దగ్గరకు వెళ్లి తినిపించమని ఓవర్ యాక్షన్ చేశాడు. ప్రిన్స్ – శుభశ్రీ మధ్య గొడవ జరిగింది. దీంతో నాగ్ ప్రిన్స్ కి క్లాస్ పీకాడు. శోభా ముందు నుంచే ఏడుస్తుందని నాగ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన టాస్క్ లో ఫెయిల్ అయినందుకు వారం రోజులు వాష్ రూమ్ క్లీన్ చేయాలని పనిషమెంట్ ఇచ్చాడు నాగ్.

అనంతరం ఫ్యాన్స్ పల్స్ అనేది ఉందని, దీని వల్ల బయట ఆడియన్స్ కంటెస్టెంట్స్ గురించి ఏమనుకుంటున్నారు అనేది మార్కుల రూపంలో కంటెస్టెంట్స్ కి తెలియచేస్తామని నాగ్ తెలిపారు. అయితే కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ పల్స్ మార్కులు చెప్పేముందు ఈ వారం రోజులకి మీకు మీరు ఎంత మార్కులు వేసుకుంటారో చెప్పమన్నాడు. ఒక్కొక్కరు వాళ్లకు వాళ్ళు వేసుకున్న మార్కులు చెప్పగా నాగార్జున ఆడియన్స్ ఇచ్చిన మార్కులు చెప్పాడు..

ప్రియాంక జైన్ 100 మార్కులు వేసుకోగా ఆమెకు ఆడియన్స్ 71 మార్కులు ఇచ్చారు.
శివాజీ 90 మార్కులు వేసుకోగా ఆడియన్స్ 74 మార్కులు ఇచ్చారు.
దామిని 95 మార్కులు వేయగా ఆడియన్స్ ఆమెకు 62 మార్కులు ఇచ్చారు.
ప్రిన్స్ 94 మార్కులు వేసుకోగా 69 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
షకీలా 85 మార్కులు వేసుకోగా 69 మార్కులు వచ్చాయి.
సందీప్ 90 మార్కులు వేసుకోగా 72 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
శోభాశెట్టి 93 మార్కులు వేసుకోగా ఆమెకు 76 మార్కులు వచ్చాయి.
టేస్టీ తేజ 100 మార్కులు వేసుకోగా 77 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
రతిక 90 మార్కులు వేసుకోగా ఆడియన్స్ 80 మార్కులు ఇచ్చారు.
గౌతమ్ 100 మార్కులు వేసుకోగా 60 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
కిరణ్ రాథోడ్ 100 మార్కులు వేసుకోగా 50 మార్కులు ఆడియన్స్ ఇచ్చారు.
ప్రశాంత్ 78 మార్కులు వేసుకోగా 74 మార్కులు వచ్చాయి.
శుభశ్రీ 98 మార్కులు వేసుకోగా 65 మార్కులు వచ్చాయి.
చివరగా అమర్‌దీప్ 97 మార్కులు వేసుకోగా 60 మార్కులు వచ్చాయి.

మొత్తానికి ఈ ఫ్యాన్స్ పల్స్ లో ఈ వారం రతిక టాప్ లో నిలిచింది. ప్రశాంత్ తో ప్రేమ వ్యవహారం వల్ల, రాహుల్ తో బ్రేకప్ అయిందనే వార్త బయటకి రావడంతో, బయట ఆమె గురించి వెతకడం మొదలుపెట్టడం వల్లే రతిక టాప్ లో నిలిచిందని భావిస్తున్నారు.

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న‌కు ప్ర‌మాదం..! అస‌లు నిజం ఇదే..

ఇక చివర్లో పవర్ అస్త్ర అనే టాస్క్ ఇచ్చారు. ఇది సాధిస్తే 5 వారాలు కచ్చితంగా హౌస్ లో ఉంటారు అని నాగ్ ప్రకటించాడు. దీని కోసం అంతా పోటీ పడ్డారు. ఫైనల్ గా ప్రియాంక జైన్, ఆట సందీప్ నిలవగా వీరికి ఒక బాల్స్ గేమ్ పెడితే అందులో సందీప్ గెలిచి పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. మరి నేడు ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుందేమో చూడాలి.