Bigg Boss 7 : నామినేషన్స్ రచ్చ మొదలు.. దామిని, ప్రిన్స్ యావర్ ల మధ్య మాటల యుద్ధం..
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7లో విజయవంతంగా రెండు వారాలు పూర్తి అయ్యాయి. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు.
![Bigg Boss 7 : నామినేషన్స్ రచ్చ మొదలు.. దామిని, ప్రిన్స్ యావర్ ల మధ్య మాటల యుద్ధం.. Bigg Boss 7 : నామినేషన్స్ రచ్చ మొదలు.. దామిని, ప్రిన్స్ యావర్ ల మధ్య మాటల యుద్ధం..](https://10tv.in/wp-content/uploads/2023/09/New-Project-1-37.jpg)
Bigg Boss 7 Nominations
Bigg Boss 7 Nominations : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7లో విజయవంతంగా రెండు వారాలు పూర్తి అయ్యాయి. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ రచ్చ జరుగుతుందనే విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ వారం కూడా బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టేశాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదల అయ్యింది. హౌస్మేట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి ముఖంపై ఫోమ్ ను స్ప్రే చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు.
గౌతమ్‌ను ప్రియాంక నామినేట్ చేసింది. ఒకే పాయింట్‌తో పదే పదే నామినేట్ చేయడం కరెక్టు కాదని గౌతమ్ అన్నాడు. అటు దామిని, ప్రిన్స్ యావర్‌ల మధ్య హీటెక్కించే వాదన చోటు చేసుకుంది. ప్రిన్స్ ప్రవర్తన తనకు నచ్చలేదని దామిని అనగా.. ఆమె తన మాటలను వెనక్కు తీసుకోవాలని యావర్ అన్నాడు. ఇందుకు దామిని నిరాకరించింది. దీంతో ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ..ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో వచ్చిన దగ్గరి నుంచి ఆటలో కంటే కిచెన్లోనే చాలా ఎక్కువగా కనిపిస్తుందని దామిని ని వెక్కిరిస్తున్నట్లుగా ‘ఐయామ్ కుకింగ్ ఐయామ్ కుకింగ్’ అంటూ గట్టిగా అరిచాడు.
Bhagavanth Kesari : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర.. భగవంత్ కేసరి ఫ్లాష్ మాబ్.. వీడియో వైరల్
దీంతో తాను వారం పాటు వంట చేయనని దామిని అనగా, అయితే చేయకు అంటూ ప్రిన్స్ అన్నాడు. దామిని ఏదో చెప్పబోతుండగా థ్యాంక్యూ అంటూ ప్రిన్స్ ఆమెను మాట్లాడకుండా చేశాడు. చాలా సెల్ఫీష్ గా ఆలోచిస్తుందని చెప్పి రతికను శోభాశెట్టి నామినేట్ చేసింది. శుభ శ్రీని అమర్ నామినేట్ చేశాడు. ఆమె ఇంటి పనులు చేయడం లేదనే కారణంతో చేశాడు. నువ్వు చీపురు పట్టుకుని ఎప్పుడైనా హాలు కానీ కిచెన్ కానీ ఊడ్చావా..? అంటూ ప్రశ్నించాడు. అటు రతిక.. గౌతమ్ కృష్ణని నామినేట్ చేసింది. అయితే.. ఆమె చెప్పేది వినకుండా ఫస్ట్ నువ్వు విను విను అంటూ గౌతమ్ అరిచాడు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.