Abijeet : బిగ్‌బాస్ అభిజీత్.. చాలా గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ.. ‘మిస్ పర్ఫెక్ట్’ కోసం

మిస్ పర్ఫెక్ట్(Miss Perfect) సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా గ్యాప్ తర్వాత అభిజీత్ మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో సిరీస్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

Abijeet : బిగ్‌బాస్ అభిజీత్.. చాలా గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ.. ‘మిస్ పర్ఫెక్ట్’ కోసం

Bigg Boss Abhijeet Exclusive Interview for Miss Perfect Web Series

Abijeet : లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ జంటగా నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్ ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో మిస్ పర్ఫెక్ట్ ప్రేక్షకులని మెప్పించింది.

మిస్ పర్ఫెక్ట్(Miss Perfect) సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా గ్యాప్ తర్వాత అభిజీత్ మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో సిరీస్ గురించి, తన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేశారు. అభిజీత్ మాట్లాడుతూ..

#మిస్ పర్ఫెక్ట్ లో రోహిత్ అనే క్యారెక్టర్ నాది. చాలా లేజీ పర్సన్, లైఫ్ ని లైట్ తీసుకునే పాత్ర. కాకపోతే వంట ఒక్కటి మాత్రం బాగా చేసే పాత్ర. రియల్ లైఫ్ లో కొంత మాత్రం నాకు కనెక్ట్ అవుతుంది. కానీ బయట చాలామందిని చూసాను.

#చాలామంది ఉద్యోగంలో ఉండలేక, బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఒక సంఘర్షణలో ఉంటారు. ఉద్యోగం కాదని వేరే పనిచేయాలనుకుంటే 30-35 వయసు మధ్యలోనే చేయాలి. 40 దాటిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి. అప్పుడు రిస్క్ చేయలేము.

#యాక్టర్ గా కెరీర్ విషయంలో మాత్రం సీరియస్ గానే ఉన్నా. మా అమ్మ పెళ్లి చేసుకోమని అడుగుతుంది రోజూ. లైఫ్ లో చాలా సెలెక్టివ్ గా ఉంటా. అది నాకు మైనస్ అవ్వొచ్చు.

#మిస్ పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ సిరీస్. ఏదైనా కథ విన్నప్పుడు నేను చేయగలనా, నాకు సెట్ అవుతుందా అని ఆలోచిస్తా. నచ్చనివి చేసి రిలీజ్ చేయడం ఈజీనే కానీ ఆడియెన్స్ కు నచ్చదు. వాళ్లు ఏదో చేసేస్తే చూసే ట్రెండ్ ఇప్పుడు లేదు.

Also Read : Saindhav : వెంకీ మామ ‘సైంధవ్‌’ ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎప్పుడు..? ఎక్కడ..?

#మిస్ పర్ఫెక్ట్ సిరీస్ మంచి రామ్ కామ్ మాత్రమే కాదు ఇందులో ఫన్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్ లో కొన్ని క్యారెక్టర్స్ మధ్య ఈ కథ జరుగుతుంది. షూటింగ్ మాత్రం సమ్మర్ లో చేయడం వల్ల బాగా ఇబ్బందిపడ్డాం.

#లావణ్య త్రిపాఠీ మంచి కోస్టార్. ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉండేది. మా మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి సిరీస్ లో. నేను, తను దాదాపు ఒకే టైమ్ లో కెరీర్ స్టార్ట్ చేశాం. కాకపోతే లావణ్య నాకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. తన యాక్టింగ్ కి రెస్పెక్ట్ ఇస్తాను.

#మిస్ పర్ఫెక్ట్ సిరీస్ కు సుప్రియ గారు ప్రొడ్యూసర్ అవ్వడం హ్యాపీగా ఉంది. నాకు మంచి కథ దొరికితే నేను ఆ కథను తీసుకెళ్లే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ లో సుప్రియ గారు ఒకరు. ఒక ఫ్లాప్ సినిమా మంచి రిలేషన్ ని పోగొడుతుంది. అందుకే నేను సినిమా సెలెక్షన్ లో జాగ్రత్తగా ఉంటాను. ఈ సిరీస్ చూసాక మేము ఒక మ్యాజిక్ ఫీల్ అయ్యాం. మీరు కూడా అదే ఫీల్ అవుతారు.