Saindhav : వెంకీ మామ ‘సైంధవ్’ ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎప్పుడు..? ఎక్కడ..?
వెంకీ మామ మాస్ బొమ్మ ‘సైంధవ్’ ఓటీటీకి వచ్చేస్తుంది. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమ్ కాబోతుందో తెలుసా..?

Venkatesh 75th Movie Saindhav ott release and streaming details
Saindhav : విక్టరీ వెంకటేష్ తన ల్యాండ్ మార్క్ 75వ మూవీని దర్శకుడు శైలేష్ కొలనుతో చేసిన సంగతి తెలిసిందే. ‘సైంధవ్’ టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ట్రైలర్ అండ్ టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. వెంకీ మామ మాస్ ఆకట్టుకున్నప్పటికీ.. థియేటర్స్ లో మరో మూడు సినిమాలు రిలీజయ్యి ఉండడంతో కలెక్షన్స్ విషయంలో ఎదురు దెబ్బ తగిలింది.
ఇక థియేటర్ లో ఓకే అనిపించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు చూస్తుంది. ఈ వీకెండ్ లో బుల్లితెరలో ఎంటర్టైన్ చేయడానికి ‘సైంధవ్’ ఓటీటీకి వచ్చేస్తుంది. ఈ శనివారం ఫిబ్రవరి 3 నుంచి ప్రైమ్ వీడియోలో ‘సైంధవ్’ స్ట్రీమ్ కాబోతుంది. మరి థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయ్యినవారు ఎవరైనా ఉంటే.. ఈ వీకెండ్ కి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
Also read : Sundeep Kishan : కుమారి ఆంటీకి అండగా నిలుస్తానన్న సందీప్ కిషన్..
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో కూతురికి ఒక అరుదైన జబ్బు వస్తుంది. ఆ జబ్బుని నయం చేయడానికి ఒక్క ఇంజెక్షన్ చాలు, కానీ దాని విలువ 17 కోట్లు. దీంతో పాపని ఎలా బతికించాలా అని బాధపడుతున్న హీరోకి.. తన కూతురిలా ఎంతోమంది పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో హీరో ఒక టెర్రరిస్ట్ ముఠాతో గొడవ పెట్టుకుంటాడు. వారంతా హీరోని చూసి భయపడుతుంటారు.
అసలు హీరోని చూసి ఆ టెర్రరిస్ట్ ముఠా ఎందుకు బయపడింది..? అసలు హీరో గతంలో ఏం చేసేవాడు..? చివరికి హీరో తన పాపని ఎలా బతికించుకుంటాడు..? అనేది తెలుసుకోవాలంటే ఈ వీకెండ్ మీరు సినిమా చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా.. తదితరులు నటించారు.