Bigg Boss 8 : బస్తాల కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్.. నేను ఆడను బిగ్ బాస్ అంటూ అంటూ వెళ్లిపోయిన అవినాష్..
నామినేషన్స్ అయిపోగా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఆడుతున్నారు.

Bigg Boss Contestants fight for Food Task Promo goes Viral
Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సాగుతుంది. ఇప్పటికే ఏడు వారాలు ముగిసి ఎనిమిదో వారం రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే నామినేషన్స్ అయిపోగా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఆడుతున్నారు. హౌస్ లో రాయల్ టీమ్, ఓజి టీమ్ అంటూ రెండు టీమ్స్ గా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఇందులో బిగ్ బాస్.. ప్రతి రాజ్యానికి ఆహరం అవసరం. అలాంటి ఆహరం కోసం ఇచ్చే టాస్క్ పట్టుకో కార్ట్ లో పెట్టుకో. ఇందులో 8 బస్తాలు పట్టుకొని తోపుడు బండి మీద పెట్టాలి అని ఫుడ్ కోసం టాస్క్ ఇచ్చాడు. అయితే పై నుంచి పడుతున్న బస్తాలను పట్టుకోడానికి రెండు టీమ్స్ నుంచి ఇద్దరిద్దరు అబ్బాయిలు వచ్చారు.
ఈ క్రమంలో వచ్చిన బస్తాల కోసం ఒకరిపై ఒకరు పడిపోయి, నీళ్ళల్లో పడి, ఒకరి మీద పడి ఒకరు కొట్టుకున్నారు. ప్రోమోలో అయితే నిఖిల్ టీమ్ ఎక్కువ బస్తాలు గెలిచినట్టు ఉంది. అయితే ఇలా కొట్టుకోవడంతో అవినాష్ నేను ఆడను బిగ్ బాస్ అంటూ ఈ కొట్టుకోవడం, తోసుకోవడం ఏంటి అని మైక్ తీసేసి వెళ్ళిపోయాడు. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ ఇవాళ రాత్రికి చూడాల్సిందే. మీరు కూడా ఇవాళ్టి బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..