Priyanka Jain : అతనితోనే పెళ్లి.. ఎప్పుడంటే.. పెళ్లి కబురు చెప్పిన బిగ్ బాస్ ప్రియాంక జైన్..

తాజాగా ప్రియాంక జైన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.

Priyanka Jain : అతనితోనే పెళ్లి.. ఎప్పుడంటే.. పెళ్లి కబురు చెప్పిన బిగ్ బాస్ ప్రియాంక జైన్..

Bigg Boss fame Priyanka Jain gives Clarity on her Marriage with Shivakumar

Updated On : May 25, 2025 / 3:13 PM IST

Priyanka Jain : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ బిగ్ బాస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. గత కొన్నాళ్ల నుంచి శివకుమార్ అనే మరో నటుడుతో ప్రేమలో ఉంది. ఇద్దరూ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా శివకుమార్ – ప్రియాంక జైన్ ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో ఆమె ఫాలోవర్స్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారు.

తాజాగా ప్రియాంక జైన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.

Also Read : Vishnupriya – Prithvi : పృథ్వీతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ.. ఒకవేళ అతను చెప్తే..

ప్రియాంక జైన్ మాట్లాడుతూ.. ఇటీవల శివకు నాకు బ్రేకప్ అని, మేమిద్దరం విడిపోతున్నామని వార్తలు వచ్చాయి. అవన్నీ అబద్దం. 2026లో శివ, నేను పెళ్లి చేసుకుంటాము. త్వరలోనే అధికారికంగా చెప్తాము. ఒకవేళ కుదిరితే ఈ సంవత్సరమే చేసుకుంటాం. మా పెళ్లి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని తెలిపింది. దీంతో శివకుమార్ – ప్రియాంక మధ్య ఎలాంటి విబేధాలు లేవని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని క్లారిటీ ఇచ్చేసింది ప్రియాంక.

Also Read : Vishnupriya : బెట్టింగ్ యాప్స్ కేసుపై విష్ణుప్రియ కామెంట్స్.. అవును నేను తప్పు చేశాను.. మమ్మల్ని కాదు టార్గెట్ చేయాల్సింది..