Priyanka Jain : మా నాన్నని మోసం చేసారు.. మాకు సొంత ఇల్లు కూడా లేదు..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక జైన్ తన ఫ్యామిలీ కష్టాలు తెలిపింది.

Bigg Boss Fame Priyanka Jain Tells about her Father and Their Problems
Priyanka Jain : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ బిగ్ బాస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అనంతరం పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక జైన్ తన ఫ్యామిలీ కష్టాలు తెలిపింది.
ప్రియాంక జైన్ మాట్లాడుతూ.. మేము ముంబైలో ఉండేవాళ్ళం. నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నని ఒక ఫ్రెండ్ మోసం చేసాడు. అతను నాన్నని అడ్డం పెట్టుకొని డబ్బుల విషయంలో చాలా మందిని మోసం చేయడంతో వాళ్ళు మా నాన్న మీద పడ్డారు. దాంతో మా నాన్నకు ఉన్నదంతా ఇచ్చేసారు. ఆ తర్వాత బెంగుళూరుకు వచ్చేసారు. నేను, మా అమ్మ, మా తమ్ముడు ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేసాము. మా నాన్న అక్కడే వర్క్ చేసేవాళ్ళు. అందుకే మా నాన్న డబ్బులు సేవ్ చేసుకోమని చెప్తారు. మాకు సొంత ఇల్లు కూడా లేదు. మా సొంతూళ్లో మా నాన్నమ్మ – తాతయ్య పేరు మీద ఇళ్లు కట్టాలి అదే నా కోరిక. ఇప్పుడు రెంట్ హౌస్ లోనే ఉంటున్నాము. బయట జనాలు మాకు ఏదో భారీగా ఆస్తులు ఉన్నాయి, బాగా సంపాదించేస్తున్నాము అనుకుంటారు. కానీ రియాలిటీ వేరు, మాకు ఏం లేవు అని తెలిపింది.