Janhvi Kapoor : కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తల్లి శ్రీదేవిలా.. ప్రతి డ్రెస్ లోను అమ్మ కనపడేలా జాన్వీ స్పెషల్ డిజైన్స్..
ఈసారి కాన్స్ లో జాన్వీ కపూర్ కూడా పాల్గొంది.

Janhvi Kapoor Pays Tribute to Her Mother on Cannes Film Festival with Dresses
Janhvi Kapoor : ఫ్రాన్స్ లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫిలిం ఫెస్టివల్ లో మన ఇండియా నుంచి కూడా అనేకమంది సెలబ్రిటీలు హాజరవుతున్నారు. అయితే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటేనే ముఖ్యంగా వెరైటీ డ్రెస్సులకు, ఫ్యాషన్ ట్రెండ్ కి కేరాఫ్ అడ్రెస్. అక్కడికి వచ్చే నటినటీమణులు కొత్తకొత్త డ్రెస్ లు వేసి అలరిస్తూ ఆశ్చర్యపోయేలా అచేస్తారు.
ఈసారి కాన్స్ లో జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. అయితే జాన్వీ డిఫరెంట్ డ్రెస్ లతో కనిపించగా తన తల్లి శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు ఈ కాన్స్ అంటుంది జాన్వీ. మొదటి రోజు జాన్వీ గతంలో తన తల్లి వేసిన ఒక డ్రెస్ లాంటిదే డిజైన్ చేయించి వేసుకుంది. ఆ తర్వాత కూడా తన తల్లి వేసిన మరో డ్రెస్ డిజైన్ చేయించి వేసుకుంది. జాన్వీ మొదటి సారి కాన్స్ లో పాల్గొనడంతో తన తల్లికి ట్రిబ్యూట్ ఇవ్వడానికే ఆమెలా డ్రెస్ డిజైన్ చేసి వేసుకున్నాను అని తెలిపింది. దీంతో జాన్వీని అభినందిస్తున్నారు.
ఇక జాన్వీ తన కాన్స్ ఫొటోలు అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంది.
Also Read : Sumanth : తాతయ్య చనిపోయినప్పుడు బాధపడలేదు.. 19 ఏళ్లకే మా అమ్మ చనిపోయింది.. నేను అమెరికాలో.. సుమంత్ ఎమోషనల్..