Punarnavi Bhupalam : కాబోయే భర్తను పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం.. అతడి పేరు ఏంటో తెలుసా?
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం(Punarnavi Bhupalam ).
Bigg boss fame Punarnavi Bhupalam introduces her future husband
Punarnavi Bhupalam : ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, ఆటతీరుతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది.
బిగ్‌బాస్ షో కన్నా ముందు ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఎందుకో ఎమో, ఒక చిన్న విరామం, సైకిల్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక బిగ్‌బాస్ షో తరువాత చాలా సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చినప్పటికి కూడా వాటికి నో చెప్పి పై చదువుల కోసం లండన్‌కు వెళ్లింది. అక్కడ సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తోంది.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో మరో మెగా హీరో..

ఇక అక్కడకు వెళ్లినప్పటికి కూడా వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది పునర్నవి భూపాలం. తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ‘నేను అతడికి ఎస్ చెప్పాను.’ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో పునర్నవి ప్రపోజ్ చేస్తున్న ఫోటో కూడా ఉంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమెకు కాబోయే భర్త పేరు హేమంత్ వర్మగా తెలుస్తోంది. అతడు ఏం చేస్తాడు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక అతడు కూడా తన సోషల్ మీడియాలో పునర్నవితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘నాకు కావాల్సింది దొరికింది. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు వేచి ఉండలేను.’ అంటూ రాసుకొచ్చాడు
View this post on Instagram
