Shivaji : బిగ్‌బాస్ శివాజీ కొత్త సినిమా టీజ‌ర్ చూశారా..?

ప్ర‌ముఖ న‌టుడు, బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో కంటెస్టెంట్ అయిన శివాజీ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. నైంటీస్ అనే పేరుతో తెర‌కెక్కిన‌ వెబ్‌సిరీస్‌లో ఆయ‌న ప్ర‌ధాన పాత్ర పోషించారు.

Shivaji : బిగ్‌బాస్ శివాజీ కొత్త సినిమా టీజ‌ర్ చూశారా..?

90s A Middle Class Biopic Teaser

Updated On : November 1, 2023 / 4:32 PM IST

Bigg Boss fame Shivaji : ప్ర‌ముఖ న‌టుడు, బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో కంటెస్టెంట్ అయిన శివాజీ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. నైంటీస్ అనే పేరుతో తెర‌కెక్కిన‌ వెబ్‌సిరీస్‌లో ఆయ‌న ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ అనేది ట్యాగ్‌లైన్‌. తొలిప్రేమ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెల్లెల్లిగా న‌టించిన వాసుకీ ఈ వెబ్‌సిరీస్‌లో శివాజీ భార్య‌గా క‌నిపించ‌నుంది. మ్యాథ్స్‌ టీచర్‌ చంద్రశేఖర్ గా శివాజీ న‌టించ‌గా, ఆయ‌న భార్య శోభారాణి పాత్రలో వాసుకీ క‌నిపించ‌నుంది. జ‌న‌వ‌రి 5, 2024లో ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకోగా తాజాగా టీజ‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేష్‌ విడుద‌ల చేశారు. వనపర్తి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్‌ సిరీస్ సాగుతోంది. మా చిన్నారి ర‌వితేజ‌కు శుభాకాంక్ష‌లు తెల‌పాంటూ పేరెంట్స్ చంద్ర‌శేఖ‌ర్‌, శోభారాణిలు కోరుతున్నార‌ని టీవీలో చెప్ప‌డంతో టీజ‌ర్ ఆరంభ‌మైంది. 100 కు 99 మార్కులు వ‌చ్చినా ఇంకా ఒక మార్కు ఎందుకు త‌గ్గింద‌నే తండ్రిగా శివాజీ క‌నిపించారు. మొత్తంగా ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌రిగే సంఘ‌ట‌న ఆధారంగా ఈ సిరీస్ తెర‌కెక్కింది. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

Vishwak Sen : విశ్వక్‌సేన్ వివాదం పై స్పదించిన నాగవంశీ.. ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ షూటింగ్ బ్యాలన్స్ ఉంది..

వాసంతిక మచ్చ, మౌళి, స్నేహల్ కామత్, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండ‌గా సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అజీమ్‌ మొహమ్మద్‌ కెమెరామెన్‌గా, గాంధీ నడికుడియార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా ప‌ని చేశారు. శ్రీధర్‌ సోంపల్లి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వ‌ర్తించ‌గా.. షర్వీన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేయనున్నారు.