Sound Party : బిగ్‌బాస్ ఫేమ్ VJ సన్నీ ‘సౌండ్ పార్టీ’ సినిమా ట్రైలర్ చూశారా?

తాజాగా 'సౌండ్ పార్టీ' సినిమా ట్రైలర్ రిలీజయింది. రెండున్నర నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి దాకా ఫుల్ కామెడీగా సాగింది.

Sound Party : బిగ్‌బాస్ ఫేమ్ VJ సన్నీ ‘సౌండ్ పార్టీ’ సినిమా ట్రైలర్ చూశారా?

Bigg Boss Fame VJ Sunny Sound Party Movie Trailer Released

Updated On : November 17, 2023 / 8:42 PM IST

Sound Party Trailer : యాంకర్, సీరియల్ నటుడు VJ సన్నీ బిగ్ బాస్ సీజన్ 5లో విన్నర్ గా నిలిచిన తర్వాత హీరోగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోగా సకలగుణాభిరామ, అన్ స్టాపబుల్ అనే రెండు సినిమాల్లో నటించాడు VJ సన్నీ. ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది.

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా తెరకెక్కిన సినిమా ‘సౌండ్ పార్టీ’. VJ సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంజ‌య్ శేరి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేశాయి. ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.

Also Read : Nani : ఎలక్షన్ మోడ్‌లో నాని.. మీ ప్రేమ, మీ ఓట్ మాకే అంటూ ప్రచారం మొదలు..

తాజాగా ‘సౌండ్ పార్టీ’ సినిమా ట్రైలర్ రిలీజయింది. రెండున్నర నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి దాకా ఫుల్ కామెడీగా సాగింది. కామెడీ పంచులతో, శివన్నారాయణ, పృథ్వీ, సప్తగిరి.. ఇలా చాలామంది కమెడియన్స్ చేసే అల్లరితో ట్రైలర్ సాగింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సినిమా నవంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.