Nani : ఎలక్షన్ మోడ్‌లో నాని.. మీ ప్రేమ, మీ ఓట్ మాకే అంటూ ప్రచారం మొదలు..

ఎన్నికల సమయంలో సినిమా వాళ్ళు కూడా ప్రచారం చేస్తారని తెలిసిందే. ఇదే బాటలో నాని కూడా ప్రచారం చేయబోతున్నాడు.

Nani : ఎలక్షన్ మోడ్‌లో నాని.. మీ ప్రేమ, మీ ఓట్ మాకే అంటూ ప్రచారం మొదలు..

Nani Doing Political Promotions for Hi Nanna Movie

Updated On : November 17, 2023 / 7:09 PM IST

Nani : న్యాచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా ‘హాయ్ నాన్న’(Hi Nanna)తో రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తుండగా శృతిహాసన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది అని సమాచారం. ఇక ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో పాటు నాని, మృణాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని టీజర్ తో తెలిసిపోతుంది. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది.

ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు నాని. అలాగే తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. ఎన్నికల సమయంలో సినిమా వాళ్ళు కూడా ప్రచారం చేస్తారని తెలిసిందే. ఇదే బాటలో నాని కూడా ప్రచారం చేయబోతున్నాడు. అయితే ఏ పార్టీకో కాదు, తన సొంత సినిమాకు నాని ఎలక్షన్ మూడ్ ని వాడుకొని ప్రచారం చేయబోతున్నాడు.

Also Read : Spark The Life : ‘స్పార్క్-ది లైఫ్’ మూవీ రివ్యూ.. సరికొత్త పాయింట్‌ని థ్రిల్లింగ్ గా చూపించి..

తాజాగా నాని తన సోషల్ మీడియాలో.. ఇప్పుడు అందరూ ఎలక్షన్ మూడ్ లో ఉన్నారు. మీరు కూడా ఎందుకు జాయిన్ అవ్వకూడదు. డిసెంబర్ 7న మీ ప్రేమ, మీ ఓట్ మాకే అవ్వాలని కోరుకుంటూ.. మీ హాయ్ నాన్న పార్టీ ప్రసిడెంట్ – విరాజ్. కొన్ని స్పెషల్ ప్రచారాలు చేయబోతున్నాం. అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి నాని ఎలక్షన్ మూడ్ ని ఏ రేంజ్ లో వాడుకొని ప్రచారం చేస్తాడో చూడాలి.