Bigg Boss OTT: ఓటీటీ షో లైవ్ షో కానేకాదు.. నటి షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ అంటే భారీ మార్కెటింగ్ తెచ్చిపెట్టే రియాలిటీ షో. అసలు ఈ షో పెద్ద బూటకం అన్నా.. ఇందులో టాస్కులన్నీ ముందే ప్రిపేర్ అవుతాయని.. అసలు గేమ్ విన్నర్ ఎవరో కూడా బిగ్ బాస్ ముందే..

Bigg Boss OTT: ఓటీటీ షో లైవ్ షో కానేకాదు.. నటి షాకింగ్ కామెంట్స్

Bigg Boss Ott

Updated On : March 5, 2022 / 3:36 PM IST

Bigg Boss OTT: బిగ్ బాస్ అంటే భారీ మార్కెటింగ్ తెచ్చిపెట్టే రియాలిటీ షో. అసలు ఈ షో పెద్ద బూటకం అన్నా.. ఇందులో టాస్కులన్నీ ముందే ప్రిపేర్ అవుతాయని.. అసలు గేమ్ విన్నర్ ఎవరో కూడా బిగ్ బాస్ ముందే డిసైడ్ చేసి ఉంటాడని కూడా చెప్పుకుంటారు. ఇన్ని విమర్శలు ఉన్నా షోకి ఆదరణ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.. ఇంకా రోజురోజుకీ పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు కూడా సీజన్ల మీద సీజన్లు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి.

Bigg Boss OTT Telugu: నాకు ఇద్దరు.. నాకు ముగ్గురు.. హౌస్‌లో డేటింగ్ హిస్టరీ!

హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 15 సీజన్ జరుగుతుండగా ఓటీటీ తొలి సీజన్ కూడా పూర్తయింది. ఇక, ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ ఫస్ట్ సీజన్ మొదలై తొలి వారం గడుస్తుంది. బిగ్ బాస్ ఎడిటింగ్ ఒక రోజులో జరిగేది ఒక గంటలో ట్రిమ్ చేసి వాళ్ళకి కావాల్సింది మాత్రమే ప్రసారం చేస్తారని అపవాదులుతో ఓటీటీ 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తామని షో నిర్వాహకులు ప్రకటించారు. అయితే.. అసలు ఓటీటీ షో లైవ్ కానేకాదని.. వాళ్లకు నచ్చినట్లుగా ఎడిటింగ్‌ చేసి వివాదాస్పదంగా ఉండేట్టు టెలికాస్ట్‌ చేస్తున్నారని.. తమిళ నటి వనితా విజయ్‌ కుమార్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?

తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ అల్టిమేట్ షోపై వనితా వరస ట్వీట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ అల్టిమేట్‌ నుంచి వచ్చేసినందుకు, కొందరు అనుకుంటున్నట్లుగా షో నుంచి పారిపోయినందుకు సంతోషంగా ఉందన్నా వనితా.. బిగ్‌బాస్‌ హౌస్‌ పిచ్చి, చిరాకు కలిగించే ప్రదేశమని.. అక్కడ ఉన్నందుకు ఇప్పటికీ పీడకలలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు. ఆ షో నుంచి బయటకు వచ్చేసినా సరే, పూర్తిగా దాన్నుంచి బయటపడేందుకు కొంత సమయం పడుతుందని వరస ట్వీట్ చేస్తున్నారు.