Bigg Boss 9 Telugu: ఇదెక్కడి మాస్ రా మామా.. దుమ్ములేపిన బిగ్ బాస్ 9.. టీవీ చరిత్రలోనే హైయ్యెస్ట్ రేటింగ్
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేటింగ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Bigg Boss Season 9 grand finale episode created new records in ratings.
- బిగ్ బాస్ 9 ఫినాలే ఎపిసోడ్ కి హయ్యెస్ట్ రేటింగ్
- గత ఐదేళ్ళలో ఇదే టాప్
- త్వరలోనే కొత్త సీజన్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రీసెంట్ గా ముగిసింది. ఈ సీజన్ కి కామనర్, ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. అయితే, ఈ షోలో జరిగిన గ్రాండ్ ఫినాలే ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ తనూజనా, కళ్యాణ్ అవుతాడా అని తెలుసుకోవడానికి ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఎగబడి మరీ చూశారు. ఈ నేపధ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Aadi Saikumar: మరోసారి తండ్రైన అది సాయికుమార్.. ఈసారి వారసుడు!
ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనూహ్యమైన రేటింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఏకంగా 19.6 TVR రేటింగ్‌ను సాధించింది. ఇది మాములు విషయం కాదు. దీంతో స్టార్ మా సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
ఇక చాలా మంది బిగ్ బాస్ పై నెగిటీవ్ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఒక బూతు షో అని, పనికిమాలిన షో అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ షో కి వచ్చిన రేటింగ్ చాలు ఆడియన్స్ లో బిగ్ బాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. ఇక త్వరలోనే కొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు బిగ్ బాస్ టీం.
