Bigg Boss 6 Telugu: రెండు నెలల్లో కొత్త సీజన్.. హోస్ట్‌గా నటసింహం బాలయ్య?
బిగ్ బాస్ ఐదవ సీజన్ అలా ముగిసిందో లేదో ఆరవ సీజన్ మీద ప్రచారం మొదలైపోయింది. ఆ మాటకొస్తే ఐదవ సీజన్ ఫినాలే స్టేజ్ మీద నుండే హోస్ట్ నాగార్జున ఆరవ సీజన్ మీద ఆసక్తి మొదలయ్యేలా చేశాడు.

Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఐదవ సీజన్ అలా ముగిసిందో లేదో ఆరవ సీజన్ మీద ప్రచారం మొదలైపోయింది. ఆ మాటకొస్తే ఐదవ సీజన్ ఫినాలే స్టేజ్ మీద నుండే హోస్ట్ నాగార్జున ఆరవ సీజన్ మీద ఆసక్తి మొదలయ్యేలా చేశాడు. మరో రెండు నెలల్లోనే ఆరవ సీజన్ మొదలవుతుందని చెప్పి ఆశ్చర్య పరిచాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఐదు సీజన్లు దాదాపుగా ఏడాది తేడాతోనే మొదలవగా.. ఇప్పుడు ఆరవ సీజన్ రెండు నెలల గ్యాప్ లోనే మొదలు పెట్టనున్నట్లుగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
Oo Antava Song: సామ్ స్పెషల్ సాంగ్.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!
అయితే, నాగ్ ప్రకటించిన రెండు నెలలో కొత్త సీజన్ అన్నది ఆరవ సీజన్ కాదని.. ఓటీటీలో తొలి సీజన్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే బాలీవుడ్ లో కూడా బిగ్ బాస్ మెయిన్ షోతో పాటు ఓటీటీ తొలి సీజన్ మొదలు పెట్టారు. దీంతో ఇక్కడ కూడా ఓటీటీ సీజన్ మొదలవుతుందని మెయిన్ ఆరవ సీజన్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఉంటుందని చెప్పుకుంటున్నారు. రెండు నెలలో మొదలయ్యేది ఏ సీజన్ అన్నది పక్కన పెడితే ఈసారి హోస్ట్ ఎవరన్న దానిపై కూడా క్రేజీ ప్రచారం జరిగిపోతుంది. ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ అదరగొట్టనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ టాక్ మొదలైంది.
AP Movie Theaters: నిన్న థియేటర్లు సీజ్.. నేడు స్వచ్ఛందంగా బంద్!
ఇప్పటి వరకు తొలి రెండు సీజన్లు ఎన్టీఆర్, నానీ చేస్తే మూడు నుండి ఐదవ సీజన్ వరకు నాగ్ చేశాడు. అయితే, ఈసారి హోస్ట్ మార్చాలని నిర్వాహకులు భావిస్తుండగా బాలయ్య అయితే షోకు కొత్త రూపం వస్తుందంటున్నారు. ఆహాలో అన్ స్టాపబుల్ షో ఇచ్చిన బూస్టప్ తో బాలయ్య ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొట్టడం ఖాయంగా చెప్పుకుంటున్నారు. అయితే.. ఇది ప్రస్తుతానికి ఓ ప్రచారం మాత్రమే కాగా.. రెండు నెలల్లో మొదలయ్యేది ఆరవ సీజనా లేక ఓటీటీ సీజనా.. హోస్ట్ నాగార్జునే చేస్తారా.. లేక బాలయ్య మెరుస్తాడా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.