Bigg Boss 10 Weekend Episode : షాలినికి గట్టిగా ఇచ్చిపడేసిన నాగార్జున.. హౌస్ లో మ్యానిప్యులేటర్, పప్పెట్స్ ఎవరు..? బిగ్ బాస్ 10 ‘డే 13’ వీకెండ్ ఎపిసోడ్..
షాలిని చేసిన హడావిడికి నాగ్ గట్టిగానే ఇచ్చాడు. (Bigg Boss 10 Weekend Episode)
Bigg Boss 10 Weekend Episode
Bigg Boss 10 Weekend Episode : నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 10 లో మొదటి కెప్టెన్ గా ఝాన్సీ గెలిచింది. నేడు వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆడియన్స్ తో మాట్లాడారు. తర్వాత హౌస్ లో జరిగింది చూపించారు. వంశీ, త్రిగున్ కాఫీ తాగుతూ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. త్రిగున్ దేబ్జానీ కాఫీ దొంగిలించి రామ్ కి కూడా ఇచ్చాడు. రామ్ ఈ విషయాన్ని దేబ్జానికి చెప్పేసాడు. దీంతో త్రిగున్ వచ్చి దేబ్జానీ తో మాట్లాడాడు.
అనంతరం గోల్డ్ కాయిన్స్ టాస్క్ ఇచ్చి కెప్టెన్ ఎవరికైనా ఇద్దరికి గోల్డ్కీ కాయిన్స్ ఇవ్వొచ్చు అని చెప్పారు. సీజన్ అయిపోయేలోపు ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్లకు ఒక సర్ ప్రైజ్ ఇస్తామన్నారు బిగ్ బాస్. దీంతో ఝాన్సీ ముకేశ్ కి ఒకటి, రామ్ ప్రసాద్ కి ఒకటి ఇచ్చారు. అనంతరం ట్రూత్, స్పైస్ గేమ్ ఆడారు. ట్రూత్ వస్తే సంచాలక్ అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా చెప్పాలి. స్పైస్ వస్తే అక్కడ ఉన్న స్పైసి ఫుడ్ తినాలి. ఇద్దరిద్దరు ఒకేసారి ఆడారు. దీనికి వంశీ సంచాలక్ గా వ్యవహరించారు.
Also Read : Deepika-Ranveer: దీపికా-రణ్వీర్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం.. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి
మొదట సుధీర్-అమన్ ఆడగా సుధీర్ కి ట్రూత్ వస్తే హౌస్ లో మ్యానిప్యులేటర్ ఎవరు అంటే త్రిగున్ అని చెప్పాడు. అమన్ స్పైస్ ఫుడ్ తిన్నాడు. తర్వాత ఝాన్సీ-షాలిని ఆడగడా ఝాన్సీ కి ట్రూత్ వచ్చింది. మొదట ఫ్రెండ్ అనుకున్నావు కానీ ఇప్పుడు కాదు అనేవాళ్ళు ఎవరు అని అడగ్గా త్రిగున్ అని చెప్పింది. షాలిని స్పైస్ ఫుడ్ తింది. ముకేశ్-త్రిగున్ ఆడగా ముకేశ్ కి ట్రూత్ వస్తే హౌస్ లో రెండు ఫేస్ లు ఉన్నది ఎవరు అంటే త్రిగున్, షాలిని అని చెప్పాడు. త్రిగున్ స్పైస్ ఫుడ్ తిన్నాడు. నరేష్-చరణ్ ఆడగా నరేష్ కి ట్రూత్ వస్తే ఎవరితో ఎక్కువ గొడవ పడతావు అవసరం లేకపోయినా అని అడగ్గా షాలినితో అని చెప్పాడు. చరణ్ స్పైస్ ఫుడ్ తిన్నాడు. వర్షిణి-సృష్టి ఆడగా వర్షిణికి ట్రూత్ వస్తే హౌస్ లో ఇరిటేటింగ్ పర్సన్ ఎవరు అని అడగ్గా త్రిగున్ అని చెప్పింది. సృష్టి స్పైస్ ఫుడ్ తింది.
అనంతరం రోహిత్, షాలిని ఇక తమ గ్రూప్ ముచ్చట్లు పెట్టుకున్నారు. రోహిత్ అంటే ఇష్టమని షాలిని చెప్పింది. అనంతరం నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. రాగానే ఈ వారం కృష్ణుడు, సృష్టి అసలు యాక్టివ్ గా లేరు అని వీడియోస్ చూపించాడు నాగార్జున. ఇందుకు గాను కృష్ణుడు, సృష్టి లను స్టోర్ రూమ్ లో కూర్చొని ఈ వీకెండ్ అంతా అక్కడనుంచే చూడండి. ఈ రెండు రోజులు మీరు హౌస్ మేట్స్ కాదు అని పనిష్మెంట్ ఇచ్చాడు నాగ్. ఆ తర్వాత ఝాన్సీ కెప్టెన్ అయినందుకు అభినందించాడు.
అనంతరం త్రిగున్ దేబ్జానీ కాఫీ దొంగలించిన విషయం అడిగాడు నాగార్జున. కాఫీ దొంగలించినందుకు త్రిగున్, రామ్ ప్రసాద్ లను సీక్రెట్ చెప్పమన్నాడు. త్రిగున్ బిగ్ బాస్ ఇచ్చిన దయ్యం టాస్క్ చెప్పాడు. త్రిగున్ దయ్యం టాస్క్ ఫెయిల్ అయ్యావు అని నాగార్జున అన్నాడు. ఇంకోటి చెప్పమంటే త్రిగున్ ఒకప్పుడు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు ఒకరికి తెలియకుండా ఒకర్ని మెయింటైన్ చేసేవాడ్ని అని సీక్రెట్ చెప్పాడు. ఇక రామ్ ప్రసాద్ ని సీక్రెట్ చెప్పమంటే నాలుగేళ్ళ క్రితం డ్రంక్ & డ్రైవ్ చెకింగ్ లో దొరికేవాడ్ని కానీ కార్ వేరే వాళ్ళకు ఇచ్చి ముందుకు తీసుకు రమ్మని హెల్ప్ అడిగాను అతను తెచ్చారు. అప్పట్నుంచి అతను నెంబర్ తీసుకొని మాట్లాడుతున్నాడు అనే సీక్రెట్ పెట్టాడు. వంశీ కూడా కాఫీ తీసుకున్నందుకు ఆతన్ని కూడా అడిగాడు. వంశీ సిక్స్త్ క్లాస్ లో ఒక అమ్మాయి క్రష్ ఉండేది. ఆ అమ్మాయి స్కూల్ మారిపోయి వెళ్ళిపోయినా ఇంటర్ వరకు ఆ అమ్మాయిని అలాగే ఇష్టపడ్డాను. తర్వాత ఆ అమ్మాయి వచ్చిందని తెలుసుకొనే నేను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని కలుద్దాం అనుకుంటే వాళ్ళ నాన్న తిట్టి పంపించేశాడు అని చెప్పాడు.
Also See : Jabardasth Rohini : లండన్లో జబర్దస్త్ రోహిణి.. ఫోటోలు వైరల్..
ఇక ఈ వారం మ్యానిప్యులేటర్ ఎవరు – వాళ్ళ చేతిలో ఉన్న పప్పెట్ ఎవరు అనే గేమ్ ఆడించారు. అందరూ ఈ విషయం చెప్పాలి. అలా అందరితో మ్యానిప్యులేటర్, పప్పెట్ చెప్పిస్తూ ఈ వారం వాళ్ళు చేసిన పనులను, తప్పులను గుర్తుచేస్తూ తిట్టడం, పనిష్మెంట్స్ ఇవ్వడం చేసాడు నాగార్జున.
మొదట చరణ్ ని పిలవగా మ్యానిప్యులేటర్ వర్షిణి – సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. గార్డ్స్ గేమ్ లో సుధీర్ వర్షిణి మాటలు విని అతని ఆలోచనలు మార్చుకున్నాడు అని చెప్పడంతో దీని పై కాసేపు డిస్కషన్ సాగింది. ఇక చరణ్ త్రిగున్ తో గేమ్ లో ఓడిపోయినందుకు, స్మార్ట్ గా ఆడావని నువ్వు అనుకుంటున్నావు అని తిట్టాడు నాగార్జున.
తర్వాత రామ్ ప్రసాద్ ని పిలవగా మ్యానిప్యులేటర్ త్రిగున్ – వంశీ పప్పెట్ అని చెప్పాడు. త్రిగున్ చెప్పేవన్నీ వంశీ చేస్తాడు అనిపిస్తుంది అని చెప్పాడు. రామ్ ప్రసాద్ తో పాటు హౌస్ లో చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతున్నారు అని నాగార్జున వీడియోలు చూపించి కుక్కలు అరిచే మ్యూజిక్ వినిపించారు. ఇందుకు పనిష్మెంట్ గా హౌస్ లో అందరికి రాత్రి పూట తప్ప ఏ టైంలో కూడా బెడ్ వాడకూడదు అని పనిష్మెంట్ ఇచ్చారు నాగ్. బిగ్ బాస్ చెప్పేదాకా ఈ పనిష్మెంట్ కొనసాగుతుందని చెప్పాడు. అలాగే చరణ్, త్రిగున్ టాస్క్ లో రామ్ ప్రసాద్ సంచాలక్ గా తప్పుగా అర్ధం చేసుకున్నందుకు తిట్టాడు నాగ్. అనంతరం దేబ్జానీని ఎందుకు ఏడ్చావు అని అడిగి, బాగా ఆడినందుకు అభినందించారు నాగార్జున.
తర్వాత వర్షిణి ని పిలవగా మ్యానిప్యులేటర్ రోహిత్ – చరణ్ పప్పెట్ అని చెప్పింది. ఈ విషయం అందరికి తెలిసిబడే కానీ చరణ్ ఒప్పుకోలేదు. వర్షిణి సంచాలక్ సరిగ్గా చేయనందుకు తిట్టాడు నాగ్. వర్షిణికి పనిష్మెంట్ ఏం ఇవ్వాలి అని రోహిత్ ని అడిగితే.. ముకేశ్ గేమ్ లో ఉన్నప్పుడు వర్షిణి కి సంచాలక్ ఇవ్వొద్దు అని చెప్పాడు. ఈ వారం వర్షిణికి సంచాలక్ ఏ గేమ్ కి రాదు అని చెప్పారు నాగ్. అలాగే వర్షిణి, షాలిని గొడవలో షాలిని చేసింది తప్పు అయినా రోహిత్ ఎందుకు ఆపలేదు, వర్షిణి ని ఎందుకు అన్నావు అని తిట్టారు రోహిత్ ని. షాలిని పై పైకి వెళ్లి మొదట గొడవకు వెళ్ళింది నువ్వే అని తిట్టాడు. నీ యాంగర్ ఇష్యూస్ ఇంకా తగ్గలేదు అని క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో షాలిని చేసిన హడావిడికి నాగ్ గట్టిగానే ఇచ్చాడు. ఇక షాలిని ఏం పనిష్మెంట్ యుద్ధం అని ఝాన్సీని అడిగితే డిష్ వాషింగ్ ఒక రోజు చేయాలి అని చెప్పింది. నాగ్ అందుకు ఓకే చెప్పి షాలినికి అదే పనిష్మెంట్ ఇచ్చాడు.
Also See : Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం షూటింగ్ పిక్స్ షేర్ చేసిన నటి శ్రీనిధి శెట్టి.. ఫోటోలు వైరల్
తర్వాత దేబ్జానీ ని పిలవగా మ్యానిప్యులేటర్ త్రిగున్ – వంశీ పప్పెట్ అని చెప్పింది. అనంతరం నామినేషన్స్ లో ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు అవ్వలేదు అని ప్రకటించారు. ఫస్ట్ సేవ్ అయింది ముకేశ్, తర్వాత దేబ్జానీ సేవ్ అయింది. అనంతరం రామ్ ప్రసాద్ సేవ్ అయ్యాడు. ఝాన్సీ సేవ్ అయ్యారు. సృష్టి, త్రిగున్, కృష్ణుడు, సుధీర్ , వర్షిణి, షాలిని, రోహిత్ లు ఇంకా డేంజర్ లోనే ఉన్నారు అని చెప్పారు.
తర్వాత షాలినిని పిలవగా మ్యానిప్యులేటర్ వర్షిణి – సుధీర్ పప్పెట్ అని చెప్పింది. దీని గురించి డిస్కషన్ అయ్యాక నాగార్జున యానిమల్ టాస్క్ లో షాలిని చేసిన గొడవని గుర్తుచేసి మళ్ళీ ఆమెనే తిట్టాడు. నువ్వేం చేసినా నువ్వే రైట్ అని ఫీల్ అవుతావు, వేరే వాళ్ళు చేస్తే రైట్ కాదా అని గట్టిగానే మరోసారి తిట్టాడు నాగ్. నోరేసుకొని అరవడం ఒక్కటే గేమ్ అనుకునే షాలిని నాగార్జున తిట్టినా తర్వాత అయినా మారుతుందా చూడాలి.
తర్వాత రోహిత్ ని పిలవగా మ్యానిప్యులేటర్ త్రిగున్ – వంశీ పప్పెట్ అని చెప్పాడు. అయితే వంశ వంట, ఫుడ్ విషయంలో అరుస్తున్నందుకు నాగ్ తిట్టారు. వంశీ, త్రిగున్ కి పనిష్మెంట్ గా ఒకరోజు ప్లాస్టర్ వేసి మాట్లాడకుండా వంట చేయాలి అని ఇచ్చారు. రోహిత్ కెప్టెన్సీ బ్యాగ్స్ గేమ్ లో త్రిగున్ ని ఇష్టమొచ్చినట్టు పట్టుకొని, అతనిపై పడినందుకు తిట్టాడు నాగ్. ఆడే విధానం మార్చుకోవాలి అని చెప్పారు.
ఫైనల్ గా నామినేషన్స్ లో ఉన్న సృష్టి, త్రిగున్, కృష్ణుడు, సుధీర్ , వర్షిణి, షాలిని, రోహిత్ లను పిలిచారు. దీంట్లో షాలిని సేవ్ అయింది మిగిలిన వాళ్ళు ఇంకా సేఫ్ అవ్వలేదు. ఇది రేపు కూడా కొనసాగనుంది. మ్యానిప్యులేటర్ – పప్పెట్ గేమ్ రేపు కూడా కంటిన్యూ కానుంది. అయితే ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడని సమాచారం.
Also See : Nandita Swetha : ఇషా ఆశ్రమంలో హీరోయిన్ నందిత శ్వేత.. ఫోటోలు..
