ఎదురు తిరిగారు : కౌశల్‌కు డబ్బు పిచ్చి – ఇమ్మాన్

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 03:38 AM IST
ఎదురు తిరిగారు : కౌశల్‌కు డబ్బు పిచ్చి – ఇమ్మాన్

Updated On : February 27, 2019 / 3:38 AM IST

కౌశల్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. బిగ్ బాస్ 2 ఫైనల్ విన్నర్‌గా గెలవడం వెనుక కౌశల్ ఆర్మీ కృషి ఎంతగానో ఉంది. ఈ ఆర్మీ ఇప్పుడు తిరగబడింది. ఆయనపై సంచలన ఆరోపణలు గుప్పిస్తోంది. బిగ్ బాస్‌లో ఉన్న కౌశల్ వేరు…వాస్తవంలో కౌశల్ వేరు..అతనికి డబ్బు పిచ్చి కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమ్మాన్, ఇతరులు ఆరోపించారు.
Also Read: సర్జికల్ స్ట్రయిక్స్ – 2.0 స్పెషల్ స్టోరీస్

ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే అన్ని ఖర్చులు భరించాలని చెబుతుంటాడని, ఒక్కపైసా కూడా తీయడని పేర్కొన్నారు. బిగ్‌బాస్ విన్నర్‌‌గా వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్‌లకు ఖర్చు చేస్తానని ప్రకటించినా ఇప్పటి వరకూ ఎలాంటి సేవాకార్యక్రమాలను చేపట్టలేదని.. వాటిని దుర్వినియోగం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

బోలెడు డబ్బు ఖర్చు చేసి సక్సెస్ మీట్‌లు నిర్వహిస్తే ఇప్పుడు కౌశల్‌ని ప్రశ్నించినందుకు తనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటూ ఒకతను వాపోయారు. తనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే అభిమానులను రెచ్చగొడుతాడని, వారు రెచ్చిపోయి ట్రోల్స్ చేసేలా చేస్తాడని పేర్కొన్నారు. కౌశల్‌తో సినిమా చేద్దామని అనుకుని ఏర్పాట్లు చేసుకున్నట్లు, ఇష్టమొచ్చిన గొంతెమ్మ కోర్కెలు కోరాడని మరొక వ్యక్తి ఆరోపించారు.
Also Read: క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే.. ​​​​​​​

సినిమా తీయడం కాదని పేర్కొనడంతో తనపై వేధింపులకు దిగారని తెలిపారు. తాము కష్టపడితే బిగ్ బాస్ 2లో కౌశల్ గెలిచారని, గెలిచిన డబ్బును దుర్వినియోగం చేస్తున్నాడంటూ ఆరోపించారు. కౌశల్‌పై ఈగ వాలనివ్వని కౌశల్ ఆర్మీ యూటర్న్ తీసుకోవడం, ఆయనపై సంచలన కామెంట్స్ చేయడం  ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ ఆరోపణలపై కౌశల్ ఎలా స్పందిస్తారో చూడాలి. 
Also Read: పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే