తెలుగోళ్లందరూ ఓట్లేశారు: బిగ్ బాస్ ఓట్లు 8కోట్ల 52లక్షలు.. ఎవరికెన్నో చూద్దాం

వంద రోజులకు పైగా అలరించిన బిగ్ బాస్ మూడవ సీజన్ ముగిసింది. 17మంది కంటెస్టెంట్లతో 105రోజుల పాటు సాగిన ఈ షో లో చివరకు బిగ్ బాస్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా.. రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది.
మొత్తం 15 వారాల పాటు కొనసాగిన ఈ షో గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ తెలుగు 3 ఫైనల్స్‌లో శ్రీముఖి, అలీ రెజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహల్ ఉన్నారు.
అయితే చివరకు హౌస్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఉన్న రాహుల్ అనూహ్యంగా చివర్లో పుంజుకుని విజేతగా నిలిచాడు. అయితే చివరివారం నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 8 కోట్ల 52 లక్షల ఓట్లు పోలయ్యాయి అట. అవును తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనాభాకు ఇంచుమించు దగ్గర ఈ నంబర్.
అయితే ఒక్కక్కరు పది ఓట్లు హాట్ స్టార్ ద్వారా, 50ఓట్లు ఫోన్ కాల్ ద్వారా వేసుకోవచ్చు కాబట్టి ఇన్ని ఓట్లు సాధ్యమయ్యాయి. అయినా కూడా ఇది చాలా బిగ్ నంబరే. ఇప్పటివరకు అన్నీ బిగ్ బాస్ షోల కంటే ఈ నంబర్ చాలా ఎక్కువ.
ఇక వచ్చిన ఓట్లలో అత్యధిక ఓట్లు రాహుల్ దక్కించుకుని టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ దక్కింది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 16శాతం, వరుణ్ సందేశ్‌కు 14శాతం, అలీ రెజాకు 7శాతం ఓటింగ్ జరిగింది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. వ్యూహాలు పన్నినా కూడా చివరకు నేచురల్‌గా ఉన్న రాహుల్‌కి మాత్రమే టైటిల్ దక్కింది.